ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఖాయం అయిన వేళ చంద్రబాబు ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో నిర్వహించనున్నారని సమాచారం.. ఓటమికి గల కారణాలు.. ప్రజాతీర్పుపై స్పందిస్తారని టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
మధ్యాహ్నం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం సాయంత్రం హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ కు ఆయన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు - వైసీపీ అధినేత జగన్ కు కూడా అభినందనలు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి..
చంద్రబాబు మీడియా సమావేశంలో ప్రధానంగా ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తారని తెలుస్తోంది. పసుపు-కుంకుమ - అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు ఎందుకు పనిచేయలేదు? ప్రభుత్వ వ్యతిరేకతకు గల కారణాలను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.