బాబు ఫోన్.. సండ్ర పార్టీ మారుడేనట..

Update: 2018-12-27 10:42 GMT
తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. తాజా తెలంగాణ ఎన్నికల్లో 13 స్తానాల్లో పోటీచేసిన టీడీపీ కేవలం రెండు సీట్లలోనే గెలిచింది. అదీ ఖమ్మం జిల్లాలోనే.. సత్తుపల్లి నుంచి సండ్ర - అశ్వారావుపేట నుంచి నాగేశ్వరరావు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు.  మూడు సార్లు టీడీపీ తరుఫునే గెలిచి.. టీడీపీని కన్నతల్లిగా భావిస్తున్న సండ్రకు టీఆర్ ఎస్ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ కన్నతల్లి లాంటిపార్టీ మారితే ద్రోహం.. మారకపోతే భవిష్యత్ ఉండదు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సతమతమువుతున్నారట..

కేసీఆర్ ను ఢీకొట్టి తెలంగాణలో బతికి బట్టకట్టడం చాలా కష్టం. ఇప్పటికే రేవంత్ ఓడిపోయి కిక్కుమనకుండా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్ ఇచ్చిన ఆఫర్ తో ఆ పార్టీలో చేరిపోవాలని సండ్ర భావిస్తున్నాడట.. గులాబీ పార్టీ ప్రతిపాదనకు సండ్ర పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే అశ్వారావు పేట టీడీపీ ఎమ్మెల్యే మాత్రం తాను సండ్ర వెంట నడువనని.. టీడీపీని వీడనని చెబుతున్నాడు.  అశ్వారావుపేట ఎమ్మెల్యేతో సండ్ర చర్చలు జరిపినా ఆయన టీఆర్ ఎస్ లో చేరనని చెప్పడంతో ఇక ఆ ప్రయత్నాలు ఆపేశారు..

సండ్ర పార్టీ మారుతున్నట్టు.. టీఆర్ ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు రావడంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. సండ్రతో తాజాగా ఫోన్ లో మాట్లాడినట్టు తెలిసింది. టీటీడీలో సముచిత స్థానం కల్పిస్తానని.. భవిష్యత్ లో మరింత ప్రాధాన్యం ఇస్తానని.. పార్టీ మారవద్దని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే టీఆర్ ఎస్ లో చేరితే మంత్రి పదవి ఆఫర్ ఇస్తారనే వార్తల నేపథ్యంలో సండ్ర చూపు టీఆర్ ఎస్ వైపే కనిపిస్తోందట.. తెలుగుదేశాన్ని సండ్ర వీడడం ఖాయమనే వార్తలు ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.
Tags:    

Similar News