ఆంధ్రప్రదేశ్ లో గడచిన కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలితో చాలా కులాలు ఆయనకు దూరమవుతున్నాయి. ఆయన స్వకులంలోను ఎవరికీ పడటం లేదు. గడచిన నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించిన తీరుపై కుల పెద్దగా వ్యవహరించే పత్రికాధిపతి - రాజగురువు చంద్రబాబుపై కినుక వహించారు. ఇక బ్రహ్మణులు - విశ్వబ్రహ్మణులు - కాపులు బీసీలలోని కొన్ని కులాల వారు చంద్రబాబు నాయుడికి దూరం జరుగుతున్నారు. కాపులకు రిజర్వేషన్లు అంశంపై చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించారు. ఇది ఆయనను ఆ కులం నుంచి దూరం చేసింది .ఐ.వి.ఆర్. క్రిష్ణారావు బ్రహ్మణ కార్పరేషన్ నుంచి తొలగించడం - టిటిడి నుంచి రమణ దీక్షీతులను తొలగించడం బ్రహ్మణులకు మింగుడుపడడంలేదు. దీంతో వారూ దూరమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో అన్నీ కులాలను కలుపుకోవాలన్న యోచనతో చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు
.ఇందులో భాగంగా ముందుగా బ్రహ్మణులను టార్గెట్ గా చేసుకున్నారు. ఎవరో ఒక నాయకుడు తన దగ్గరకు వచ్చినట్లు బ్రహ్మణులతో జాగ్రత్తగా ఉండాలని - సూచించినట్లు ఒక వాట్సాప్ మేసేజ్ రూపొందించారు. ఆ నాయకుడు చేసిన సూచనపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ బ్రహ్మణులంత గొప్పవారు లేరని చిన్నపాటి మేలుకే వారు పొంగిపోతారని అన్నట్లుగా కూడా వాట్సాప్ మేసేజ్ లో పొందుపరిచారు. ఐ.వి.ఆర్. క్రిష్ణారావు - రమణ దీక్షితులు బ్రహ్మణ ప్రతినిధులు కాదని తెలుగుదేశం పార్టీ బ్రహ్మణుల కోసం ఎన్నో చేస్తోందని ఆ మేసేజ్ లో పొందుపరిచారు. అలాగే బ్రహ్మణులు నిజాయితి పరులని అందుకే అన్నీకులాల వ్యాపారస్తులు డబ్బు నిర్వాహన బాధ్యతను బ్రహ్మణులకు అప్పగించారని, ఆ మేసేజ్ లో పేర్కొన్నారు. బ్రహ్మణులను ప్రసన్నం చేసుకోవాడానికి పార్టీ కార్యకర్తలు - స్వకులస్థులు ఈ మేసేజ‌్ ని సోషల్ మీడియా ద్వారా ఎంతమందికి చేర్చగలిగితే అంత మంచిదని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని వందల గ్రూపులలో ఈ వాట్సాప్ మేసేజ్ బ్రహ్మణులకు చేరుతోంది. వారంరోజుల పాటు తెలుగు రాష్ట్రాలు దేశవిదేశాలలోని బ్రహ్మణులందరికీ ఈ మేసేజ్ చేరువ కావలని నిర్ణయించారు. అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల అసంత్రుప్తితో ఉన్న ఇతర కులాల వారికి కూడా ఇలాంటి మేసేజ్ లు పంపాలని నిర్ణయించారు.
ఇందుకోసం ముఖ్మమంత్రి తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బృందాన్నే ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. కులాలే టార్గేట్ గా మీడియా ప్రచారన్ని వీలున్నంత ఎక్కువగా చేయాలని నిర్ణయించారు.