ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జంప్ కొట్టడం సర్వసాధారణమైన విషయం. ఏపీలో కూడా అలాంటిదే మొదట్లో జరిగింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వివిధ కారణాలతో నలుగురు ఎమ్మెల్యేలు తొలుత జంప్ అయ్యారు. ఇంకా జంప్స్ ఉంటాయని అనుకున్నారు కానీ సడెన్ గా అవి ఆగిపోయాయి.
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేల తాకిడి మొదలైంది. వైసీపీలోకి వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించారు. ఎమ్మెల్యేలు తగినంత మంది వస్తే టీడీపీ శాసనసభపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో తొలినాళ్లలో అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ జగన్ ఆలోచనకు అనుగుణంగా ప్లాన్ వర్కవుట్ కాలేదు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచారు. అంటే 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే వైసీపీ వైపు మళ్లారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్లు కూడా వినిపించాయి.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీలపై కూడా దాడులు జరిపి భారీగా జరిమానాలు విధించారు. అయినా హైకోర్టుకు వెళ్లి వ్యాపారాలను రక్షించుకున్నారే తప్ప వైసీపీ వైపు రాలేదు. ఏలూరి సాంబశివరావు పరిస్థితి కూడా అంతే. ఇక పార్టీలోకి వచ్చే వాళ్లలో గంటా శ్రీనివాసరావు పేరు ఒక్కటే వినిపిస్తోంది. అయితే ఆయన రాకకు అనేక ఇబ్బందులు ఉండటంతో ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా సమాచారం. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేరు కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం బాగా జరుగుతోంది. కానీ ఆయన రాకకు కూడా బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు.
వైసీపీలోకి ఇంకా జంప్స్ ఉంటాయని అనుకున్నారు కానీ సడన్ గా ఆగిపోయాయి.. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చాడని టాక్. మీ ఆర్థికమూలాలు దెబ్బతీసినా టీడీపీ ప్రభుత్వం వస్తే వాటికి నష్ట పరిహారం కూడా వచ్చే విధంగా చూస్తానని చంద్రబాబు ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అందుకే ఇక టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అయ్యే పరిస్థితి లేదు అని తెలుస్తోంది. టీడీపీ తరుఫున ఎమ్మెల్యేల దగ్గరకు ఒక మాజీ ఎంపీ వెళ్లి రాయబారం చేశాడని.. చంద్రబాబు మాటలుగా వారికి చెప్పారని సమాచారం. అందుకే వైసీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా.. గొట్టిపాటి, పర్చూరు ఎమ్మెల్యే, మిగతా ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లాలని అనుకొని ఇప్పుడు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన హామీతోనే వారంతా వెనుకంజ వేస్తున్నారని సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పాచిక పారిందని.. అందుకే ఈ మధ్య టీడీపీ కొంచెం జోష్ గా.. ఫాస్ట్ గా అయ్యిందని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలు వస్తే బీజేపీ, జనసేనలతో కలిసి వెళ్లాలని కూడా ఇంటర్నెల్ గా డిసైడ్ అయ్యారంట.. అందుకే ఈ మధ్య బీజేపీపై టీడీపీ అంతగా దూకుడు ప్రదర్శించడం లేదని అని కూడా అంటున్నారు.
మొత్తం మీద.. జగన్ ఎత్తులకు చంద్రబాబు పైఎత్తులు వేస్తూ తన పార్టీని కాపాడుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను లేకుండా చేయాలనే జగన్ ఆలోచన ఇప్పట్లో నెరవేరేలా కూడా కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చూద్దాం మరి.. చంద్రబాబు వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో అని అంటున్నారు.