ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ చతురతకు ఇదో నిదర్శనం. ఆయన కుట్ర రాజకీయాలకు ఇదో తార్కాణం. తనపై తెలంగాణలో ఇబ్బందికర పరిప్థితులు ఎదురు కాగానే చకచకా పావులు కదిపిన చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ప్రధాన పాత్రధారి అయిన పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరేలా చేశారు. దీనికి పెద్ద స్కెచ్ ఉందని అప్పట్లో ఎవరికీ తెలియలేదు. బడాబడా రాజకీయ విశ్లేషకులకే చంద్రబాబు నాయుడి చర్య అంతుబట్టలేదు. ఓటుకు నోటు కేసులో ఎటు నుంచి ఎటు వచ్చి తన పీకకు చుట్టుకున్నా తాను బయటపడేందుకు పక్కా వ్యూహం అమలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇది ఇన్నాళ‌్లకు బయటపడింది. అది కూడా తెలంగాణలో తాము పొత్తులు పెట్టుకుంటామని ప్రకటించిన తర్వాతే కావడం గమనార్హం. తెలంగాణలో తనకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన చంద్రబాబు నాయుడు ఆనాటి నుంచే కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ... అందునా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహార శైలిని గమనించిన చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాల కోసం రేవంత్ రెడ్డిని వాడుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తన భవిష్యత్ అవసరాలను అనుసరించి రేవంత్ రెడ్డిని తెలివిగా కాంగ్రెస్ పార్టీలోకి పంపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణాలో పొత్తు విషయంలో ఆ తెలివిని వాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేదని వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి తనపై ఎలాంటి కేసులు లేకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు నాయుడి మాస్టర్ ప్లాన్. దీన్ని పక్కాగా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డిని పక్కాగా వాడుకున్నారు. కుల పరంగా కూడా రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదనే లెక్కలు తీసిన చంద్రబాబు నాయుడు తన జాగ్రత్త కోసం ముందు నుంచే చర్యలు తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన ఎత్తుగడ ఫలించేలా చంద్రబాబు నాయుడు ద్విముఖ వ్యూహం రూపొందించారని వారంటున్నారు. ఇందులో మొదటిది భారతీయ జనతా పార్టీతో సఖ్యంగా ఉండడం ఒకటైతే..... కాంగ్రెస్ పార్టీతో తన వారు సఖ్యంగా ఉండడం రెండోదిగా చెబుతున్నారు. రెండు వ్యూహాలను కూడా చంద్రబాబు నాయుడు పక్కాగా అమలు చేశారని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పంచన చేరారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే... చంద్రబాబు నాయుడి ఈ చర్యలు మాత్రం ఆయనలో గూడుకట్టుకుంటున్న భయాన్ని తెలియజేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.