నంద‌మూరి తోట‌లో...బాబు ఒక మ‌ర్రిచెట్టు..

Update: 2018-08-29 12:01 GMT
నందమూరి హరిక్రిష్ణ రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించారు. ఆయనమాజీ ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ ఆ దర్పం గాని, ఆయన తండ్రి పదవిని గాని ఎప్పుడు ఉపయోగించుకోలేదు. వారి తండ్రిగారైన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పార్టీ ప్రకటించిన తర్వాత హరిక్రిష్ణ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. తన తండ్రి ఎన్టీఆర్  చైతన్య రథానికి  సారధిగా ఆయన రాజకీయ తెరెంగెట్రం చేసారని చెప్పాలి. తన కుమారుడైన హరిక్రిష్ణకు ఎన్టీఆర్  ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎటువంటి పదవులు గాని - అధికారంగాని ఇవ్వలేదు. ఆ తర్వాత 1995లో తెలుగుదేశం పార్టీలో విబేధాలు రావడం  నారా చంద్రబాబు  నాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేసి గద్దె ఎక్కిన సంగతి మనకు తెలిసిందే.

అయితే చంద్రబాబు నాయుడు తాను ఎన్టీఆర్‌ ను గద్దె దించే క్రమంలో తన బావమరిది హరిక్రిష్ణను బాగా వాడుకున్నారు. 1996లోహరిక్రిష్ణ శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రోడ్లు - రవాణా  శేఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పనిచేసారు. 1996వ సంవత్సరంలో తన బావ అయన చంద్రబాబు నాయుడుతో విబేధాల కారణంగా విడిగా అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెద్దగా రాణించకపోవడంతో తిరిగి 2006లో తెలుగుదేశం పార్టీలో చేరారు. మర్రిచెట్టు నీడలో ఇంకా ఏ మొక్కలు పెరగవని ఓ నానుడి. అటువంటి నాయకుడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ ప్ర‌చారం ఉంది. తన బావమరిది  నందమూరి హరిక్రిష్ణను కూరలో కర్వేపాకుల వాడుకుని - అవసరం అయిన తర్వాత పారవేసారని పార్టీలో అంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే  తన కుమారుడైన లోకేష్‌ కు  దొడ్డిదారిన మంత్రిని చేసిన చంద్రబాబు - తలచుకుంటే హరిక్రిష్ణకు ఒక ఉన్నతమైన హోదాను కల్పిచడం పెద్ద కష్టం కాదు.  కానీ బాబు ఆ పని చేయలేదు. ఎందుకంటే నందమూరి వారి పేరు ఎన్టీఆర్‌ తోనే ఆగిపోవాలని బాబు ఉద్దేశ్యంగా చెబుతున్నారు.  తనతో పాటు నిలబడి తండ్రిని ఎదిరించి ముఖ్యమంత్రి హోదాను తీసుకువచ్చిన బావమరిదికి చంద్రబాబు చేసింది ఏమిలేదని హరిక్రిష్ణ అభిమానులు వాపోతున్నారు. చంద్రబాబు తలచుకుంటే హరిక్రిష్ణను రాజ్యసభకు గాని పంపిచడం పెద్ద కష్టం కాదు. కాని చంద్రబాబు కావలనే హరిక్రిష్ణను విస్మరించారు. తననే కాకుండా తన కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కూడా గతంలో ఎన్నికల ప్రచారానికి వాడుకుని తర్వాత సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద బాధపడినట్లు వారు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజ్యసభకు రాజీనామా  చేసి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చివరిలో తెలుగుదేశం నిర్వహించే మహానాడులో పాల్గొనడం కన్నా తనకు తన తండ్రి ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించడం  ముఖ్యమని హరిక్రిష్ణ సన్నిహితుల దగ్గర వ్యాఖ్యనించారని తెలిసింది.
Tags:    

Similar News