నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా నిన్న అక్కడికి వెళ్లిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాత్రి దాకా నాన్ స్టాప్ గా ప్రచారం చేశారు. నిన్న ఉదయం ఉండవల్లిలోని తన అధికారిక నివాసం నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరిన చంద్రబాబు.... కడపలో దిగి అక్కడి నుంచి కారులో నంద్యాల చేరుకున్నారు. నంద్యాలకు ముఖద్వారంలా ఉన్న అయ్యలూరులోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన చంద్రబాబు... తనదైన శైలిలో ప్రసంగించుకుంటూ ముందుకు సాగారు. రాత్రి దాకా కొనసాగిన రోడ్ షోలో ఆయన పలు చోట్ల ఓటర్లను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ప్రచారమంతా ముగిసిన తర్వాత అక్కడే మకాం వేసిన చంద్రబాబు ఈ రోజు కూడా నాన్ స్టాప్ గానే ప్రచారం చేయనున్నట్లుగా టీడీపీ ప్రకటించింది.
అయినా ఇదంతా తెలిసిందేగా అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లిపోదాం. ఏదేని నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యిందంటే... ఆ నియోజకవర్గంతో పాటు సదరు నియోజకవర్గం ఉన్న జిల్లా మొత్తంలోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్టే. అయినా ఎన్నికల కోడ్ నిబంధనలేమిటన్న విషయానికి వస్తే... ఓటర్లను ప్రభావితం చేసేలా రాజకీయ నాయకులు గానీ - అప్పటిదాకా అధికారంలో ఉన్న నేతలు గానీ ఎలాంటి ప్రకటనలు చేయకూడదు. ఈ తరహా వాతావరణాన్ని కల్పించేందుకే ఆయా ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం... సదరు ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటిస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలు... అధికార - ప్రతిపక్షమన్న తేడా లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులు - ఆ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనే రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు - పెడుతున్న ఖర్చు తదితరాలపై ఎన్నికల సంఘం ఓ కన్నేసి ఉంచుతుంది.
ఇక నిన్నటి విషయానికి వస్తే... కేవలం ఎన్నికల ప్రచారం కోసమే నంద్యాలలో అడుగుపెట్టిన చంద్రబాబు... తాను ఎన్నికల ప్రచారం కోసం రాలేదని, నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసేందుకే వచ్చానని ప్రకటించారు. అభివృద్ధి పనుల పరిశీలనకు వస్తే... అయ్యలూరు నుంచే రోడ్ షో ప్రారంభించిన చంద్రబాబు... టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయమని ఎందుకు అడిగినట్టు? అంతేనా... ఈ ప్రసంగాల సందర్భంగా బాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేశారని కూడా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని కూడా మరిచిపోయిన చంద్రబాబు నంద్యాల ఓటర్లకు హామీలు గుప్పించారు.
చంద్రబాబు నోట నుంచి వినిపించిన హామీల విషయానికి వస్తే.. రెండు నెలల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి - కాపులకు ఉద్యోగ - విద్యా అవకాశాలు కల్పిస్తానని, రూ. వందకోట్లు నిధులు కేటాయించి ముస్లిం కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లు ప్రభుత్వమే చేసేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, చంద్రన్న బీమా పథకం కింద అందజేసే డబ్బులు చనిపోయిన వ్యక్తి పెద్దకర్మ రోజునే అందేలా, 50 ఏళ్లలోపు వ్యక్తి చనిపోతే రూ. 2 లక్షలు వెంటనే అందజేస్తామని చంద్రబాబు గుక్క తిప్పుకోకుండా చెప్పేశారు. మరి దీనిని ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అవతుంది కదా అన్నది అటు వైసీపీతో పాటు ఇటు విశ్లేషకుల వాదన. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.