కేసీఆర్ ను వదిలేసి బాబును పిలిచారు

Update: 2016-11-14 09:56 GMT
నేతల మాటలకు అర్థం.. పరమార్థం వేరుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక ప్రముఖ ఛానల్ కు సంబంధించిన ఒక అధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి అతిధిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు.

హైదరాబాద్ ను వదిలి బెజవాడకు వెళ్లిన తర్వాత.. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాలకు బాబును ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్న వారు దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. కొన్ని కార్యక్రమాల్లో హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. బాబు అంత ఆసక్తి ప్రదర్శించటం లేదన్న మాట కూడా ఉంది. కానీ.. సదరు ఛానల్ నిర్వహించిన భారీ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తాను ఆందోళన చెందుతున్నానని.. కానీ.. ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన తర్వాత తనకు ఊరట లభించిందని వ్యాఖ్యానించారు. యాంత్రిక జీవితానికి అధ్యాత్మిక చింతన అవసరంగా పేర్కొన్న ఆయన.. ‘ఊరట’ మాటను ప్రస్తావించటం అండర్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు.. ఆయన ఏ ఛానల్ కార్యక్రమానికైతే అతిధిగా హాజరయ్యారో.. అదే ఛానల్ కు సంబంధించిన ప్రసారాల్ని ఏపీలో ఆ మధ్య అనధికారికంగా నిలిపివేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి.  ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి అతిధిగా హాజరు కావటంపై బాబు సంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం. ఈ ఊరట.. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తనను పిలవటమా? లేక.. నిజంగానే అధ్యాత్మిక ఎఫెక్టా? అన్నది ప్రశ్నగా మారింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News