ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ గురించి పరిచయం అక్కర్లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరిగా ఉండే మంత్రుల్లో నారాయణ ముఖ్యులు. నవ్యాంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో నారాయణ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి నారాయణను చంద్రబాబు హెచ్చరించారా? అది కూడా రాజధాని విషయం కారణంగా జరిగిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లా మందడం గ్రామంలో జూన్ 6న చంద్రబాబు భూమిపూజ చేశారు. ఆ రోజునే అక్కడి ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. పురపాలక శాఖ చీఫ్ ఇంజనీర్ తో శంకుస్థాపన చేయించారు. పనులు అప్పగించేందుకు ఈ-టెండర్లు పిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఒక కాంట్రాక్టర్ కు టెండరు దక్కింది. భవనానికి సంబంధించి సమగ్ర ప్లాన్ ను ప్రభుత్వానికి, అధికారులకు సదరు కాంట్రాక్టర్ అందజేశారు. సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలుండాలని ఖరారు చేశారు. భవనం ఎలా ఉండాలనేదానిపై సవివర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)కు ఆమోదం కూడా లభించింది. తీరా టెండర్లు అవార్డ్ చేసి డిపాజిట్ చేసి పనులు ప్రారంభించే సమయంలో మంత్రి నారాయణ జోక్యం చేసుకొని పనులు నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవల రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్ డీఏ) వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో భవన నిర్మాణంపై చర్చకొచ్చింది. సీనియర్ ఐఎఎస్ అధికారులు టక్కర్, విజయానంద్ లను సీఆర్ డీఏ పరిపాలనా భవన నిర్మాణం ఎంత వరకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. దీంతో నారాయణ జోక్యం వెలుగులోకొచ్చింది. దీంతో ఉన్నతాధికారులు జరిగిన విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
రంగంలోకి దిగిన చంద్రబాబు గ్లోబల్ టెండర్ లు పిలిచి పనులు ప్రారంభించే దశలో మోకాలడ్డటంపై పురపాలక మంత్రి నారాయణ, సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ ను పిలిపించి క్లాస్ పీకారు. పనులు ప్రారంభిస్తే ఈపాటికి సీఆర్ డీఏ భవనం దాదాపు పూర్తయ్యేదని, అదొక రోల్ మోడల్ గా ఉండేదని తీవ్రంగా మందలించారు. రాజధానిలో ఒక్క భవనం కూడా లేకపోవడంతో ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలెదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకు రోడ్ లను, పరిసరాలను సుందరీకరించాలని, రహదారుల వెంబడి మొక్కలు, చిన్న చిన్న అలంకరణలు చేసి వీఐపీలను ఆకర్షించాలని ఆదేశించగా దానికి సంబంధించిన పనులను సైతం మంత్రి నారాయణ నిలిపేయడంపై సీఎం అసంతృప్తి వెలిబుచ్చారు. టెండర్ లు పిలిచాక ఆపేయడమేంటని ప్రశ్నించారు. గతంలో అమరావతి టౌన్ షిప్ లో తాత్కాలిక రాజధాని నిర్మాణాలపై కూడా ఇలాగే చేశారని, అందుకే మధ్యలోనే ఆగిపోయాయని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ విషయంపై కూడా మంత్రి నారాయణ, శ్రీకాంత్ లపై అసహనం వ్యక్తం చేశారు.
ఇలాగే కొనసాగితే పురపాలక శాఖ పరిధి నుంచి సీఆర్ డీఏను తొలగిస్తానని సంబంధిత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారాయణను హెచ్చరించినట్లు తెలిసింది. ఆ పనులను ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షణకు అప్పగిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. రాజధాని భూసేకరణ మట్టుకే చూసుకుంటే సరిపోదని, అప్పగించిన అన్ని పనులనూ సకాలంలో చక్కబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తంగా పనులు నిర్వహణలో అలసత్వాన్ని సహించేదిలేదంటూ నారాయణను బాబు మందలించడం ఆసక్తికరంగా మారింది.