ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యాయి. అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. ఆత్మరక్షలో పడేలా చేయాలని భావిస్తున్న విపక్షం.. అందుకు తగ్గట్లే వ్యవహరిస్తే.. ఏం చేయాలనే అంశంపై ఏపీ అధికారపక్ష నేత.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సహచరులకు దిశానిర్దేశం చేశారు.
విపక్షం రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని.. విపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుదామని ఆయన సూచించారు. విపక్షం గొడవకు సిద్ధమైతే.. వాస్తవాలను వివరించటం ద్వారా.. ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేద్దామని బాబు సూచిస్తున్నారు. కష్టపడి పని చేస్తున్న తాము.. విపక్షాల మాదిరి గొడవకు దిగకుండా.. వారు రెచ్చగొడితే.. రెచ్చిపోకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరిద్దామని చెప్పటం బాగానే ఉన్నా.. ఆచరణలో ఎంతవరకు సాధ్యమన్నది పెద్ద ప్రశ్న.
గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార.. విపక్షాల మధ్య రెంత రచ్చ సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది తాజా సమావేశాలు అందుకు భిన్నంగా సాగుతాయనుకోవటం అత్యాశే అవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా.. రాజధాని అంశం.. భూసేకరణ వ్యవహారంతో.. గోదావరి పుష్కరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టటం ఖాయం. ఈ అంశాల మీద మాట్లాడే సమయంలో అధికారపక్షంపై విపక్షం విరుచుకుపడి.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తే.. బాబు చెప్పినట్లుగా తమ్ముళ్లు రెచ్చిపోకుండా ఉంటారా? లేదంటే.. చెలరేగిపోతారా? అన్నది చూడాలి.