గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ లో బాబుకు ఆ త‌ర‌హా త‌నిఖీలు!

Update: 2019-06-15 04:18 GMT
ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఊహించ‌ని అనుభ‌వం ఎదురైంది.  శుక్ర‌వారం గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు వ‌చ్చిన ఆయ‌న‌కు ఎయిర్ పోర్ట్ అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరు ఇబ్బందిక‌రంగా మారింది. బాబు వాహ‌నాన్ని ఎయిర్ పోర్టులోకి భ‌ద్ర‌తా సిబ్బంది అనుమ‌తించ‌లేదు. దీంతో సామాన్య ప్ర‌యాణికుడి త‌ర‌హాలో బాబుకు తనిఖీలు నిర్వ‌హించారు.

వీఐపీ.. జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ఉన్న చంద్ర‌బాబుకు సాధార‌ణంగా ఎయిర్ పోర్ట్ అధికారులు ప్ర‌త్యేక వాహ‌నాన్ని కేటాయిస్తుంటారు. అయితే.. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. కేంద్రంతో ఆయ‌న‌కున్న పంచాయితీ నేప‌థ్యంలో గ‌తంలో ఎప్పుడూ ఎదురుకాని వింత అనుభ‌వం ఆయ‌న‌కు ఎదురైంది.

ఎయిర్ పోర్టులో ప్ర‌త్యేక వాహ‌నం ఏర్పాటు చేయ‌క‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. సాధార‌ణ ప్ర‌యాణికుడి మాదిరి అణువ‌ణువు త‌డిమి త‌నిఖీలు నిర్వ‌హించారు. అనంత‌రం ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి విమానం వ‌ర‌కూ సాధార‌ణ ప్ర‌యాణికుడి మాదిరి బ‌స్సులోనే ప్ర‌యాణించి.. విమానం వ‌ద్ద‌కు చేరుకున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని మౌనంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌నిఖీల‌కు స‌హ‌క‌రించారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో బాబు కాన్వాయ్ కు పైలెట్ క్లియ‌రెన్స్ తొల‌గించారు. ట్రాఫిక్ లో బాబు వాహ‌నం ఆగితే భ‌ద్ర‌తా ప‌రంగా శ్రేయ‌స్క‌రం కాద‌న్న మాట పార్టీ వ‌ర్గాలు చెబుతున్నా.. అధికారులు ప‌ట్టించుకోవ‌టం లేదు. ఎయిర్ పోర్ట్ లోప‌ల మొత్తం సీఐఎస్ ఎఫ్ అధీనంలో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఇది మొత్తం కేంద్ర హోం శాఖ ఆధీనంలో ఉండ‌టం.. ప్ర‌స్తుతం దానికి మంత్రిగా అమిత్ షా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గ‌తంలో ప్ర‌తిపక్ష నేత‌గా ఉన్న‌ప్పుడు కూడా బాబుకు ఈ త‌ర‌హా అనుభ‌వం ఎదురుకాలేద‌ని గుర్తు చేసుకుంటున్నారు. ప‌ద‌వులు శాశ్వితం కాదు.. అధికారం ప‌ర్మినెంట్ కాదు.. ఎవ‌రికి ఎలాంటి గౌర‌వ మ‌ర్యాద‌లు ఇవ్వాలో ఇవ్వ‌టం స‌మంజ‌సం. ఇదే రీతిలో అంద‌రిప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తే ఇబ్బందే లేదు. కానీ.. అయిన వారికి ఒక‌లా.. కాని వారికి మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌టంలోనే అస‌లు ఇబ్బంది అంతా.

ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు అయ్యో పాపం అన్న సానుభూతి వ్య‌క్త‌మ‌య్యేలా చేయ‌ట‌మే కాదు.. ఎంత అధికారం పోతే మాత్రం మ‌రీ ఇంత‌లానా? అన్న భావ‌న క‌లగ‌టం ఖాయం. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో బాబు ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు మీడియాలో ప్ర‌ముఖంగా రాగా.. దీనిపై పౌర విమాన‌యాన శాఖ అధికారులు ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News