ఫ్యామిలీతో బాబు ఎలా ఉంటారో తెలిసింది!

Update: 2017-01-16 04:48 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనగానే సీరియస్ గా పని చేసే రాజకీయ నాయకుడిగానే కనిపిస్తారు. నిజానికి ఆయన ముఖంలో చిరునవ్వు కూడా అరుదుగా కనిపిస్తుంది. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన్ను నవ్వుతూ చూసినోళ్లు చాలా తక్కువ. అయితే.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఆయన తీరులో చాలా మార్పు వచ్చింది. దీనికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కూడా కారణమని చెప్పొచ్చు.

చంద్రబాబు ముఖంలో నవ్వు అన్నది ఉండదంటూ వైఎస్ దెప్పి పొడిచేవారు. ఆ మాటలు బాబును మార్చేలా చేయటమే కాదు.. ఆయన ఓపెన్ గా నవ్వటం మొదలు పెట్టేలా చేశాయి. నిజానికి చంద్రబాబు పెద్దగా నవ్వేస్తే.. ఆ ఫోటోను మీడియాలో ప్రముఖంగా అచ్చేసే పరిస్థితి అంటేనే.. బాబు ఎంత సీరియస్ గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

నిత్యం పని.. పని అన్నట్లుగా ఉండే చంద్రబాబు ఎంత సరదాగా ఉంటారన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. మీడియా ముందుకు అట్టే రాకుండా తన పని తాను చేసుకుంటూ పోయే బాబు సతీమణి భువనేశ్వరి.. ఆమెతో బాబు ఎంత సరదాగా ఉంటారన్న విషయం తాజా సంక్రాంతి పండగ సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఘటన అందరికి తెలిసేలా చేసింది.

సంక్రాంతి పండగ సందర్భంగా బాబు సొంతూరు నారావారి పల్లెలో బాబు ఫ్యామిలీ అంతా గడపటం తెలిసిందే. కొన్నేళ్లుగా సంక్రాంతి పండగ వస్తే చాలు బాబు ఫ్యామిలీ సొంతూరుకు వెళ్లటం ఒక అలవాటుగా ఉంది. ఈసారి కూడా పండక్కి ముందే వెళ్లిన బాబు సతీమణి భువనేశ్వరి.. బాబు కోడలు బ్రాహ్మణి తదితరులు పండగ ఏర్పాట్లు చేశారు.

పండక్కి రెండు రోజుల ముందు చంద్రబాబు అమరావతి నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో వచ్చి.. అక్కడ నుంచి నేరుగా నారావారి పల్లెకు చేరుకున్నారు. ఇంటికి వచ్చిన చంద్రబాబుకు కొబ్బరికాయతో దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ.. ‘‘వాట్ మేడం.. ఇంటిని బాగా డెకరేట్ చేశారు’’ అని భార్యను ఉద్దేశించి వ్యాఖ్యానించగా.. ‘‘మీ డైరక్షనే కదా’’అని భువనేశ్వరి సమాధానం ఇవ్వటంతో అక్కడి వారంతా నవ్వేశారు. అధ్యక్షుల వారికి స్వాగతం అంటూ కొడుకు లోకేశ్ స్వాగతం పలకటంతో బాబు నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. నిత్యం సీరియస్ గా కనిపించే బాబులో ఇలాంటి కోణం ఆసక్తికరంగా లేదూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News