ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు గారడీలు చేసి ప్రజల చెవుల్లో ఏపీ సీఎం చంద్రబాబు పూలు పెడుతుంటారనే వ్యాఖ్యలకు ఈ సంఘటనే మరో నిదర్శనమని చెప్పాలి. తన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎంతటి వారినైనా ఉపయోగించేసుకుంటారనే వ్యాఖ్యలకు మరో బలమైన ఆధారం దొరికింది. ప్రజలను ఆకట్టుకునేందుకు, సత్యాలను కూడా అసత్యాలుగా చిత్రీకరించగలరు అనేందుకు ఇంతకన్నా మరో సాక్ష్యం ఉండదేమో. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పని అబద్దం లేదన్న వాదన లేకపోలేదు. వైసీపీపై ఎలాగైనా బురద జల్లాలని ఆయన చేయని ప్రయత్నం లేదని ఓటర్లు మండిపడుతున్నారట. ఇదే సమయంలో నిజం ఎంతో కాలం దాగదు అన్నట్టుగా ఆయన చేసిన అసత్య ప్రచారం ఎంతో సేపు నిలవలేదు.
నంద్యాల ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతలకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం బండారం బయటపడింది. ఓ మహిళను అత్యాచారం చేసి హతమార్చారంటూ ఆమె ఫొటో చూపిస్తూ చంద్రబాబు ప్రచారం చేసిన విషయం గుర్తుంది కదూ! దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ.. ఆయన ఊదరగొట్టేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రచారం అంతా అసత్యమని తేలిపోయింది. చంద్రబాబు చూపిన ఫొటోలోని మహిళ మీడియా ముందుకొచ్చి... తాను బతికే ఉన్నానని భోరున విలపించింది.
రాజకీయ లబ్ధి కోసం అంత నీచమైన ఆరోపణలు చేస్తారా? అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. బాధిత మహిళ షమీమ్ మాట్లాడుతూ..‘ చనిపోయింది నేను కాదు - ఆ ఫోటోలో ఉన్న నా పక్కన ఉన్న పిల్ల. ఈ ఫోటోను పదే పదే సిటీ కేబుల్ లో ప్రసారం చేస్తున్నారు. అందులో నన్నే ఎక్కువసార్లు చూపిస్తున్నారు.’ అంటూ తన భర్తతో కలిసి మీడియా ముందుకు వచ్చింది. మరోవైపు బాధితురాలి కుటుంబీకులు కూడా చంద్రబాబు అసత్య ప్రచారంపై మండిపడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి.. .రాజకీయ లబ్ది కోసం ఇంతకు దిగజారుతానా? అని మండిపడుతున్నారు. నిజం ఎంతో కాలం దాగదనేందుకు ఇదే ఉదాహరణ! మరి చంద్రబాబు అసత్య ప్రచారాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం నేతల్లో టెన్షన్ పెంచుతోంది.