నారా భువనేశ్వరి తో పాటు తన కుటుంబాన్ని నీచంగా మాట్లాడారంటు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు, భోరున ఏడ్వటం అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో భువనేశ్వరిని ఏమన్నారన్న విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అసలు తాజా వివాదానికి మూల కారణం ఎవరు ? గన్నవరం టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీయే అన్నది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు తో వంశీ కి విభేదాలు వచ్చాయి. దాంతో వంశీ పార్టీ కి దూరమై పోయారు.
అయితే పార్టీకి దూరమై పోయిన వంశీ పై ఇప్పటి వరకు చంద్రబాబు చర్యలు తీసుకోలేక పోయారు. వంశీని అనర్హుడిని చయాలని అసెంబ్లీ స్పీకర్ కు చంద్రబాబు నుంచి ఎలాంటి లేఖ వెళ్ళలేదు. పార్టీకి దూరమైనప్పటి నుండి వంశీ ఇటు చంద్రబాబును అటు లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని హద్దులు దాటి పోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చివరకు ఏ దశకు చేరాయంటే లోకేష్ కు మాధవరెడ్డి పోలికలు ఎలా వచ్చాయో లోకేష్ తెలుసుకోవాలనేంత స్ధాయికి చేరుకున్నాయి.
లోకేష్, మాధవరెడ్డి గురించి వంశీ దారుణమైన వ్యాఖ్యలు చేసి దాదాపు నెల రోజులవుతోంది. ఇప్పటి వరకు వంశీ చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు కానీ కుటుంబ సభ్యులు కానీ లేదా నందమూరి కుటుంబ సభ్యులు లేదా పార్టీ నేతల్లో ఎవరు కానీ ఎందుకని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు ? వంశీ పై పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాకుండా పార్టీ నుంచి ఎందుకని బహిష్కరించలేదు ? మరప్పుడు వంశీ వ్యాఖ్యలను ఎందుకని తప్పు పట్ట లేదు.
తన కొడుకు ను డైరెక్టుగా భార్య భువనేశ్వరి పై పరోక్షం గాను వంశీ ఘోరమైన వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు కు తెలీదా ? తెలిసి ఇంత కాలం చంద్రబాబు ఎందుకు ఊరుకున్నట్లు ? వ్యాఖ్యలు చేసిన వంశీ పై ఇంతకాలం ఊరికే ఉండటం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులది కూడా పొరపాటే కదా.
ఇపుడు చేస్తున్న రచ్చేదో, చేస్తున్న హెచ్చరిక లేదో అప్పట్లోనే వంశీని టార్గెట్ చేస్తు ఎందుకు చేయలేదు ? అప్పట్లోనే వంశీ పై గట్టి చర్యలకు డిమాండ్లు చేసుంటే, పరువు నష్టం దావా వేసుంటే వ్యవహారం ఇందాక వచ్చుండేది కాదు. వంశీ పై తాము ఏదన్నా మాట్లాడినా, చర్యలు తీసుకున్నా వంశీ ఇంకా ఏమేమి మాట్లాడుతారో ? అనే భయం చంద్ర బాబు అండ్ కో లో ఉండ బట్టే ఇంత కాలం ఏమీ తెలియనట్లే మాట్లాడకుండా కూర్చున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.