సైబర్ టవర్స్ కట్టింది బాబు కాదా? సాక్ష్యమిదే..

Update: 2018-12-31 11:16 GMT
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏకీపారేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలకు ఏపీ మంత్రులు సరైన జవాబు చెప్పలేక ఎదురుదాడికి దిగారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ మాజీ మంత్రులు అసలైన సాక్ష్యాలను సంపాదించారు. ఇప్పడు ఈ అంశాలే ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

తాజాగా సైబర్ టవర్ కు 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ఫొటో ఓ ప్రతికలో ప్రచురితమైంది. ఈ ఫొటోలో నాటి పరిశ్రమల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ ఫొటోతో కేసీఆర్ చెప్పిన మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సైబర్ టవర్స్ నిర్మాణం జరిగిందని పదేపదే చెబుతుండేవారు. దీనిని టార్గెట్ చేసిన కేసీఆర్ అసలు విషయం బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ కు ఐటీ సంస్థలు రావడానికి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డితో పాటు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ కారణమని.. ఇందులో చంద్రబాబు పాత్ర ఏమిలేదని తేల్చి చెప్పారు. తెలంగాణలోని హైదరాబాద్ కు ఉన్న భౌగోళిక పరిస్థితుల కారణంగా ఐటీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. దీనికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి తమ వంతు సహకారం అందించాని దీనికి చంద్రబాబు తాను గొప్పలు చెప్పుకుంటున్నారని కేసీఆర్ ఏకీపారేశారు.

కాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధాని సమయంలో నేదురుమల్లి ముఖ్యమంత్రి లేరని చెబుతూ సైబర్ టవర్ విషయాన్ని మాత్రం దాట వేశారు. ఈక్రమంలో సైబర్ టవర్ శంకుస్థాపన చిత్రాలు బయటికి రావడంతో కేసీఆర్ చెబుతుందని వాస్తవమేనని ప్రజలు నమ్ముతున్నారు.

కాగా ఈ ఫొటోలు కూడా చంద్రబాబు అనుకూల మీడియానే విడుదల చేయడంతో బాబు నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్టు అయ్యింది. దీంతో ఇప్పుడు టీడీపీ నేతల నోళ్లు మూతపడ్డాయి. దీనిపై ఎవరూ స్పందించడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు ఢాంబీకాలు కొట్టుకోవడం మాని తానే చేసిన పనులు గురించే చెప్పుకుంటే బాగుంటుందని అన్ని నేనే చేశాను అని గొప్పలు చెప్పుకుంటే అందరి దృష్టిలో చులకన కావాల్సి వస్తుందని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారట.. ఇకనైనా చంద్రబాబు తన తీరును మార్చుకుంటారా? లేదో చూడాలి మరీ.



Full View
Tags:    

Similar News