'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' ప్రోగ్రాం కోసం చంద్రబాబు భారీ ప్లాన్

Update: 2022-11-30 03:13 GMT
తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ.. నిత్యం ఏదో ఒక హడావుడితో కిందా మీదా పడుతున్న తెలుగుదేశం పార్టీ ఏపీ అధికారపక్షంపై పోరాటం చేయటానికి.. వారి విధానాల్ని తామెంతగా తప్పు పడుతున్నామన్న విషయాన్ని తెలియజేసేలా ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టే సంగతి తెలిసిందే. దీనికి రోటీన్ కు భిన్నమైన పేర్లు పెడుతున్నారు టీడీపీ వ్యూహకర్తలు. తాజాగా అలాంటి ప్రోగ్రాం ఒకటి షురూ అయ్యింది. దాని పేరు.. ''ఇదేం ఖర్మ ఈ  రాష్ట్రానికి'' అంటూ డిసైడ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ ప్రభుత్వ వ్యతిరేకత విధానాల్ని ప్రజలకు తెలియజేసేందుకు ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది టీడీపీ. తాజాగా చేపట్టే కార్యక్రమం సరిగా జరగాలే కానీ.. ఈ ప్రోగ్రాం పూర్తి అయ్యేనాటినిక 50 లక్షల మంది ప్రజలకు నేరుగా కలుస్తూ.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ.. ఆయన పాలనను తూర్పార పటటమే లక్ష్యంగా మారనుందని చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని 50 రోజుల పాటు నిర్వహించనున్నారు.

ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ చార్జ్ తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంచేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం 8 వేల మందిలో ప్రత్యేక టీంలను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని ఏపీ విపక్ష నేత చంద్రబాబు ఏలూరు జిల్లా దెందలూరు గ్రామంలో అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటం కోసం ముందస్తుగా శిక్షణ శిబిరాల్ని కూడా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ.. వీడియోల్ని.. పాటల్ని సిద్ధం చేసింది. ఇక.. పోస్టర్ వార్.. సోషల్ మీడియా గురించి ప్రత్యేకండా చెప్పాల్సిన అవసరం లేదు.

తాము పార్టీ కార్యకర్తలు ఈ ప్రోగ్రాంను సీరియస్ గా తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఒక కొత్త ఫార్మాట్ ను సిద్దం చేశారు. దీని ప్రకారం తాజా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ కార్యకర్త.. వారి వివరాల్ని తీసుకోవటంతో పాటు.. ఒక మిస్డ్ కాల్ సర్వీసును షురూ చేశారు.

ఇందులో భాగంగా ఎవరి ఇంటికి వెళతారో.. వారి నుంచి ఒక మిస్డ్ కాల్ ను చేయించాల్సి ఉంటుంది. అలా వచ్చిన మిస్డ్ కాల్ ను జాగ్రత్తగా భద్రపరుస్తారని చెబుతున్నారు. అలా ఈ కార్యక్రమాన్ని తాము అనుకున్నది అనుకున్నట్లుగా 50 లక్షల మంది ప్రజల వద్దకు  చేరిందా? లేదా? అన్నది పక్కగా తేలిపోతుందంటున్నారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరకు వచ్చేసిన వేళ.. ఈ కార్యక్రమాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా నిర్వహించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. చంద్రబాబు అండ్ కో కమిట్ మెంట్ చూసినప్పుడు మాత్రం ఏదో ఒకటి జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమువతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News