తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నిర్వహణలో దూకుడు నిర్ణయాలను తీసుకుంటున్నారు. పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేసే చంద్రబాబుకు ఇటీవల ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ రచ్చ తీవ్ర ఇబ్బందిగా మారింది. పార్టీ సభ్యులు అవడమే కాకుండా టీడీపీ ఎంపీల మధ్య వివాదంగా ఈ ఎన్నికలు నిలిచాయి. తలనొప్పిగా మారిన ఈ ఎన్నికకు ముగింపు పలకాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరు ఎంపీలకు ఆయన షాకిచ్చారు.
విజయవాడలో జరిగిన స్పోర్ట్స్ రివ్యూలో చంద్రబాబు తుదినిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై చర్చిస్తున్న సందర్భంగా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఎంపీలు..సీఎం రమేష్, గల్లా జయదేవ్ లను ఏపీఓఏ నుంచి ఉపసంహరింపజేయాలని ప్రకటించారు. అధ్యక్ష రేసు నుంచి ఇరువురిని తప్పించి, మరో వ్యక్తిని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇరుపక్షాలను ఒప్పించాలని సమావేశంలో తెలిపారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘం కూడా రెండుగా విడిపోయింది. ఏపీ ఒలంపిక్ సంఘానికి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఈ పదవి కోసం గల్లా జయదేవ్, సీఎం రమేష్ పోటీపడ్డారు. గత ఏప్రిల్ లో తిరుపతిలో ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గం సమావేశమై.. గల్లా జయదేవ్ ను అధ్యక్ష పదవికి ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని, తానూ.. అధ్యక్ష రేసులో ఉన్నానని సీఎం రమేష్ ప్రకటించారు. అనంతరం హైదరాబాద్ లో జరిగిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. రెండు ఎన్నికలతో వివాదం తారస్థాయికి చేరింది.
ఒలంపిక్ అధ్యక్ష రగడతో.. చిత్తూరు జిల్లాలో రాజకీయాలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు భావించారు. ఇరువురికి ఇబ్బంది లేకుండా రేసు నుంచి ఉపసంహరింపజేయాలని నిర్ణయించారు. అధ్యక్ష పదవికి మరో వ్యక్తిని ఎంపిక చేయాలని ఆదేశించారు. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదనే..ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఒలంపిక్ అధ్యక్ష రగడకు ఇక్కడితో తెరపడినట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.