జ‌గ‌న్ వ‌ర‌ద సాయంపై చంద్ర‌బాబు సెటైర్లు

Update: 2022-07-20 05:51 GMT
గోదావ‌రి వ‌ర‌ద‌లు ఏపీలో అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీస్తున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధితుల‌ను గాలికొదిలేసింద‌ని ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. అస‌లు ఎంత వ‌ర‌ద వ‌స్తుందో కూడా ప్ర‌భుత్వానికి అంచ‌నా లేద‌ని నిప్పులు చెరుగుతున్నాయి. మ‌రోవైపు జ‌ల‌వ‌నరుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. వ‌ర‌ద‌ల‌ను ప్ర‌కృతి విపత్తును అని.. దానికి మ‌న‌మేం చేయ‌లేమ‌ని ఆయ‌న అన్న‌ట్టు ప‌త్రిక‌లు క‌థ‌నాలు ప్ర‌చురించాయి.

వ‌ర‌ద బాధితుల‌కు సాయం అంద‌డం లేద‌ని.. పున‌రావాస కేంద్రాల్లో ఉన్న‌వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని.. చిన్నారుల‌కు కూడా క‌నీసం పాలు, బిస్కెట్లు కూడా అంద‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష నేతలు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

జ‌గ‌న్ హెలికాప్ట‌ర్ లో ఏరియ‌ల్ సర్వే చేయ‌డం కాద‌ని.. రోడ్ల‌పైన ప్ర‌యాణిస్తే బాధితుల క‌ష్టాలు తెలుస్తాయని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు మండిప‌డుతున్నారు. ట్విట్ట‌ర్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ సాయంపై ధ్వ‌జ‌మెత్తారు.

నాలుగంటే నాలుగు కూర‌గాయ‌లు మాత్ర‌మే వ‌ర‌ద బాధితుల‌కు అందించార‌ని ఒక చిత్రాన్ని పోస్టు చేశారు. అందులో నాలుగు బంగాళా దుంప‌లు, నాలుగు ట‌మాటాలు, నాలుగు ఉల్లిపాయలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. జ‌గ‌న్ అందిస్తున్న వ‌ర‌ద సాయం ఇది అని చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్లు వేశారు.

నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు! ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం....లెక్క చూసుకో జగన్ రెడ్డి.. నాలుగంటే నాలుగే! అని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

జగన్ తమకు 4 ఉల్లిపాయలు, 4 టమోటాలు, 4 బంగాళదుంపలు, 5 కిలోల బియ్యం, 50 గ్రాముల పప్పు మాత్రమే అందించారని గ్రామస్థులు ఫిర్యాదు చేసిన వార్తా కథనాన్ని త‌న ట్వీటుకు చంద్ర‌బాబు జ‌త చేశారు. కాగా జూలై 20, 21, 22 తేదీల్లో పోలవరం ముంపు ప్రభావిత గ్రామాల్లో చంద్ర‌బాబు బాధితుల‌ను ఓదార్చ‌నున్నారు.
Tags:    

Similar News