అప్పుడే మైక్ తీసేసారా? బాబు సెటైర్

Update: 2019-06-13 06:58 GMT
ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ లో కూర్చుండబెట్టారు. ఈ సందర్భంగా మొదటగా మాట్లాడిన సీఎం జగన్ తమ్మినేని గొప్పతనాన్ని సభ మర్యాదలను ఉటంకిస్తూనే.. గడిచిన చంద్రబాబు హయాంలో ఎంత దారునంగా సభను నడిపారో వివరిస్తూ ఆయనను ఏకిపారేశారు..

అయితే జగన్ ప్రసంగం ముగియగానే చంద్రబాబు ను మాట్లాడవలసిందిగా స్పీకర్ తమ్మినేని కోరారు. దీంతో చంద్రబాబు మాట్లాడుతుండగా ఎవ్వరికీ వినపడలేదు. మైక్ సరిగా పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. వైసీపీ ఎమ్మెల్యేలు బాబు వాయిస్ వినబడకపోవడంతో గోల చేశారు..

దీంతో చంద్రబాబు మైక్ వాయిస్ ను అసెంబ్లీ సిబ్బంది పెంచారు. దీంతో మైక్ నందుకున్న చంద్రబాబు ‘ఇప్పుడే మీరు నా వాయిస్ రాకుండా చేశారు..మున్ముందు ఇంకా ఏం చేస్తారో ’ అంటూ నవ్వుతూ పంచులు విసిరారు. మీరు మైక్ ఇచ్చినా.. ఇవ్వకున్నా నా పోరాటం ఆగదని.. మీపై పోరాడుతూనే ఉంటానని జగన్ ను చూస్తూ బాబు ధీమాగా చెప్పుకొచ్చారు.

తొలి సభ, తొలి ప్రసంగంలో జగన్ మాట్లాడిన వివాదాస్పద అంశాల వైపు పోనని.. ముందు ముందు చూస్తారని బాబు చెప్పుకొచ్చారు. అధికారంలోకి రావడం మీకు కొత్త కావచ్చు కానీ.. ప్రతిపక్షంలో ఉండడం నాకు కొత్త కాదని.. ఇది వరకూ చాలాసార్లు ప్రతిపక్షంలో పనిచేశానని.. మీపై నా పోరాటం మరింత ఉధృతంగా ఉంటుందంటూ బాబు కూడా బాగానే కౌంటర్ ఇచ్చారు.


Tags:    

Similar News