రాబోయే ఎన్నికల్లో వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అన్‌స్టాపబుల్ అని, రాష్ట్ర భవిష్యత్తు కోసం బుల్లెట్‌లా దూసుకుతామన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన 'ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్ని బానిసల్లా చూస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు తరాల సంపదనంతా లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిత్యావసరాల ధరలు పెరిగాయని.. పెట్రోల్, కరెంట్, వంట గ్యాస్, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని గుర్తు చేశారు. చివరకు చెత్తపైనా పన్ను వేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 73 ఏళ్ల ముసలోడు అంటూ తనపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తన వయసు ముఖ్యమంత్రులు దేశంలో చాలామంది ఉన్నారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వయసు, తన వయసు ఒకటేనన్నారు.
మాట్లాడితే జగన్ తన వయసు గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి సైకోలు ఉంటే నష్టం కానీ.. తనలాంటి అనుభవం ఉన్నవాళ్లు ఉంటే రాష్ట్రానికి ఉపయోగమే తప్ప నష్టం లేదని తేల్చిచెప్పారు. జగన్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నాడని.. తాను అధికారంలోకి వచ్చాక ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లాలో పుచ్చలపల్లి సుందరయ్య, పొట్టి శ్రీరాములు, బెజవాడ గోపాలరెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గొప్ప వ్యక్తులు పుట్టారని.. అలాంటి జిల్లాలో పనికిమాలిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు జిల్లా పచ్చని పంటలతో ఉంటే జిల్లా అని., ఎక్కడికి వెళ్లినా నెల్లూరు భోజనం అంటారని.. అలాంటి జిల్లాలో రైతులు వైసీపీ పాలనలో తీవ్ర అన్యాయానికి గురయ్యారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.
కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టులో అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి.. దాన్ని వేరేవారికి కట్టబెట్టారని గుర్తు చేశారు. జగన్ పాలనలో ఆయన వర్గం (రెడ్లు) కూడా అనందంగా లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబుల వద్ద కూడా జగన్ దోపిడీ చేస్తున్నారన్నారు. మద్యం ధరలు ఎందుకు పెరిగాయి? దుకాణాల్లో ఆన్‌లైన్ చెల్లింపులు ఎందుకు లేవని ప్రశ్నించారు.
పెన్నా నది పక్కనే ఉన్నా కోవూరులో ఇసుక దొరికే పరిస్థితి లేదని.. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు నష్టపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సైకో పాలన ప్రభావమేనని చంద్రబాబు మండిపడ్డారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేసిన దుర్మార్గుడు జగన్ అని ధ్వజమెత్తారు. చంద్రన్న బీమా, విదేశీ విద్య, పండగ కానుకలు ఇలా అన్నింటినీ ఎత్తేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ.200 ఉన్న పింఛనును రూ.2 వేలు చేసింది.. టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వాటిని తొలగించడానికి నోటీసులు ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. పోలీసులకూ ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం మాట వినకపోతే వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో పోలీసులకు గౌరవం ఉండేదని.. ఇప్పుడది లేదని వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో రాష్ట్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు ఉండేవని చంద్రబాబు గుర్తు చేశారు. నేడు ఆక్వాను కూడా జగన్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకి ఇస్తానన్న సీఎం.. ఇప్పుడు జోన్ పరిధి అంటూ లెక్కలు వేస్తున్నారు అని ధ్వజమెత్తారు. నెల్లూరులో చేతకాని మంత్రి, అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారంతా విమర్శలు మాని రైతుల సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, మైనారిటీలకు రంజాన్ తోఫా ఆపేశారని చంద్రబాబు మండిపడ్డారు. యానాది సామాజికవర్గం కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.