ఏపీలో జగన్ బలవంతుడిగా కనిపిస్తున్నారా లేక విపక్షాలు ఆయన్ని అలా పెంచేసి చూపిస్తున్నాయా అన్నదే ప్రశ్న. దానికి జవాబు మాత్రం అంత సులువుగా దొరకదు. ఎందుకంటే జగన్ కి 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి. కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న సీన్ ఇది. అదే సమయంలో దేశంలో అత్యంత బలవంతుడిగా ఉన్న నరేంద్ర మోడీ మద్దతు జగన్ కి ఉంది. ఇక్కడ ఇద్దరి అవసరాల బట్టి రాజకీయం సాగుతోంది. అందువల్ల జగన్ బీజేపీ తెర వెనక బంధాలు విపక్షాలకు తెలిసినా అవి కూడా ఏమీ అనలేకపోతున్నాయి.
పైగా జగన్ని బీజేపీని విడగొట్టే పనిలోనే టీడీపీ తెగ బిజీగా ఉంది. ఏపీలో జగన్ అప్పులు విచ్చలవిడిగా చేస్తున్నాడు అని కేంద్రం నోటితో చెప్పించిన తెలుగుదేశం వారికి మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు అని అడిగితే మాత్రం అక్కడ నుంచి సైలెంట్ మాత్రమే సమాధానంగా వస్తోంది. అంటే కేవలం మాటలకే తప్ప చేతలకు కేంద్రం దిగడం లేదని అర్ధమైపోతోంది. దానికి ముందే చెప్పినట్లుగా ఎవరి కారణాలు వారికి ఉన్నాయి.
ఇక చంద్రబాబు ఇపుడు ఏపీ గ్రౌండ్ లో చెలరేగిపోవాల్సినంత స్కోప్ ఉంది. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఆయన కోసం అతి పెద్ద ప్లేస్ ఉంది. కానీ బాబు మాత్రం గతాన్ని మరచిపోయినట్లుగా ఉన్నారు. ఆయన ఎంతసేపూ బీజేపీతో సయోధ్య కోసమే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తు కుదుర్చుకోవాలనే ఆలోచిస్తున్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి ఏముందని. ఆ పార్టీ నోటా కంటే తక్కువ నంబర్ లో పడిపోయింది
ఇక జాతీయ స్థాయిలో మోడీ ఇమేజ్ కూడా మసకబారుతోంది. ఈ టైమ్ లో అందరినీ కలుపుకుని కూటమి కట్టే మొనగాడు అయితే కనిపించడంలేదు. దాంతో చంద్రబాబు ఒకే ఒక్క డేరింగ్ స్టెప్ వేస్తే చాలు మొత్తానికి మొత్తం మారుతుంది. బాబుకు కూడా పూర్వం వైభవం తప్పకుండా లభిస్తుంది అని అంటున్నారు. చంద్రబాబు మోడీని గట్టిగా ఎదిరించాలి. ఏమిటీ అప్పులు అంటూ ఆయన కేంద్రాన్ని కూడా నిలదీయాలి. ఏపీకి ఏం చేశారు అంటూ గట్టిగా తగులుకోవాలి.
ఒక వైపు జగన్ని కూడా విమర్శిస్తూనే మోడీని కూడా ముగ్గులోకి లాగాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ని అలా ఉంచేశారు, విభజన హామీలు ఏమీ నెరవేర్చలేదు, పైగా ప్రజల మీద పెను భారాలు మోపుతున్నారు అంటూ గట్టిగా విరుచుకుపడాలి. అదే టైమ్ లో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పెద్దలకు మద్దతు ఇస్తున్నారని, అందుకే ఏపీ పట్ల కేంద్రం పట్టనట్లుగా ఉంటోందని జనాలకు అర్ధమయ్యేట్లుగా విడమరచి చెప్పాలి. ఇపుడు బాబు చేయాల్సింది బీజేపీ తో పొత్తు కోసం కాదు, వారి చల్లని చూపు కోసం ఎదురు చూడడం కాదు.
తానే నిప్పురవ్వలా మారాలి కేంద్రం చర్యలను ఎండగట్టాలి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఆనాడు జగన్ విపక్షాంలో ఉన్నపుడు ఎలా బాబు కేంద్రానికి దాసోహం అయ్యాడన్నది జనాలకి చెప్పి ఎండగట్టారో ఇపుడు అంతకు అంతలా అన్నట్లుగా బాబు విరుచుకుపడితేనే భారీ రాజకీయ లాభం. ఒక్క ఏపీలోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా బాబు వెలిగే సమయం వచ్చింది. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు డేరింగ్ స్టెప్ వేయాలి. మరి ఆయన చేస్తారా. లేక కమలం కరుణ కోసం చూస్తారా. చూడాలి.