బాబుపై త‌మ్ముళ్ల ఒత్తిడి.. జూనియ‌ర్ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌.

Update: 2022-07-14 10:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు పెద్ద స‌మ‌స్యే వ‌చ్చింది. పార్టీని ముందుకు తీసుకువెళ్లాల‌ని, వ‌చ్చే ఎన్నిక ల్లో విజ‌యం సాధించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఒక‌ర‌కంగా.. ఈ విష‌యంలో ఆయ‌న గ‌ట్టిప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో అనుకున్న‌ది సాధించేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నా రు. అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దూరంగా ఉన్న అన్న‌గారి కుటుంబాన్ని త‌న‌వైపు తిప్పుకొన్నారు.

టీడీపీ ఆఫీసు పై దాడి, చంద్ర‌బాబు స‌తీమ‌ణి పై వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అన్న‌గారి కుటుంబం మొత్తం చంద్ర‌బాబుకు అండ‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇదే ఊపు.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా  కొన‌సాగించాల‌నే వ్యూహంతో చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కాశాన్ని బ‌ట్టి.. ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా ప్ర‌చారానికి వినియోగించుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు.. ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న విభేదాల‌కు కూడా చెక్ పెడుతున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీ లో ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆయ‌న స‌తీమ‌ణి, బీజేపీ నాయ‌కురాలు, అన్న‌గారి కుమార్తె.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తోనూ చెలిమి చేస్తున్నారు. ఇటీవ‌ల ద‌గ్గుబాటికి ఆరోగ్యం బాగోలేక ఆసుప త్రిలో ఉన్న స్వ‌యంగా చంద్ర‌బాబు వెళ్లి ప‌ల‌క‌రించి వ‌చ్చారు. దీంతో ఇరు కుటుంబాల‌కు ఉన్న విభేదా లు దాదాపు స‌మ‌సిపోయాయ‌ని అంటున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. చంద్ర‌బాబు రాజ‌కీయ మ‌ద్ద‌తుకు ప్ర‌యో జన‌క‌రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యానికి వ‌స్తే.. టీడీపీ నాయ‌కులు.. ఇటీవ‌ల కాలంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్మ‌రణ చేస్తు న్నారు. ఆయ‌న‌ను పార్టీ లోకి తీసుకురావాల‌ని కోరుతున్నారు. వాస్త‌వానికి 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో జూ నియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌చారం చేశారు. త‌ర్వాత‌..

ఏమైందో ఏమో.. గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న రావాల‌నే డిమాండ్ తెర‌మీదికి వ‌చ్చిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు అటు వైపు కూడా దృష్టి పెడుతున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే జూనియ‌ర్‌ను క‌లిసి.. మ‌న‌సులో మాట చెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీలో టాక్ న‌డుస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News