సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ.. పక్కా ప్లానింగ్ కు కేరాఫ్ అడ్రస్ అన్న పేరు ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను ఎంతగానో అభిమానించే వారిని సైతం చిరాకు తెప్పిస్తుంటుంది.
మిగిలిన విషయాలన్నింటిలోనూ ముందస్తు జాగ్రత్తల్ని తీసుకునే ఆయన.. ఎన్నికల వేళ అభ్యర్థుల్ని ఫైనల్ చేసే విషయంలో ఆయన ప్రదర్శించే జాగుపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉంటాయి. ఈ విషయంలో తాను మారిపోతానని.. రాబోయే ఎన్నికల్లో ముందుస్తుగానే అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తామంటూ ఆయన మాటలు చెబుతారు కానీ చేతల్లో మాత్రం అలాంటివేమీ చేయరు.
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తాను మారిన వైనాన్ని చేతల్లో చేసి చూపించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోటీన్ కు భిన్నంగా.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లను ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు.
చంద్రబాబులో ఇంత మార్పా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఈ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. ఏపీ అధికారపక్షానికి మింగుడు పడని సవాలును విసిరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లను కన్ఫర్మ్ చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. అదే పని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉందా? అంటూ ఇరుకున పడేసే వ్యాఖ్యలు చేశారు.
జగన్ తన వైఫల్యాల్ని తన ఎమ్మెల్యేలపై నెట్టి వేయాలని కోరుకుంటున్నారని.. అందుకే ఆయనతో భేటీ అంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ల రావన్న భయంతో ఉంటే.. మరికొందరు టికెట్లు వచ్చినా గెలవలేమన్న ఆందోళనలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం లేదని.. ప్రజా సమస్యలపై వారు చేస్తున్న పోరాటమే వారిని గెలిపిస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా రోటీన్ కు భిన్నంగా తాను టికెట్ల లెక్కల్ని తేల్చేసిన చంద్రబాబు.. సీఎం జగన్ కు సరికొత్త సవాలు విసిరి.. ఆయనకు మరో తలనొప్పిని తెచ్చి పెట్టారన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.