ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాడుగుల నియోజకవర్గంలో వర్గ పోరు టీడీపీ అధినేత చంద్రబాబును ఇరకాటంలో పెడుతోందా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బూడి ముత్యాల నాయుడు విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కాగా టీడీపీలో వర్గ పోరుతోనే బూడి ముత్యాల నాయుడు వరుసగా రెండుసార్లు గెలుపొందారని చెబుతున్నారు. 2014, 2019లో ఎన్నికల్లో టీడీపీ తరపున మాడుగుల నుంచి గవిరెడ్డి రామానాయుడు పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి గవిరెడ్డి రామా నాయుడు గెలుపొందడం గమనార్హం. గవిరెడ్డి రామానాయుడు అంత కీలకంగా ఉండటం లేదని భావించిన టీడీపీ అధిష్టానం ఇటీవల పివీజీ కుమార్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది.
2009లో ఎమ్మెల్యేగా గెలిచిన గవిరెడ్డి రామానాయుడు ఆ సమయంలో ప్రతి గ్రామంలోనూ సీనియర్లను పట్టించుకోకపోవడంతో వారు అసమ్మతివాదులుగా తయారై ఒక గ్రూపుగా ఏర్పడ్డారని అంటున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ అసమ్మతి గ్రూపు.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నాయకత్వంలో గవిరెడ్డి రామానాయుడిని ఓడించారని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ అసమ్మతి గ్రూపు కొనసాగుతోందని అంటున్నారు.
గతంలో టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా గవిరెడ్డి రామా నాయుడు ఉన్నప్పుడు ఆయన గ్రూపుతో పాటు పైలా ప్రసాదరావు గ్రూపు ఉండేదని చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను ఏకం చేయడంలో గవిరెడ్డి విఫలమయ్యారని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి ఆ బాధ్యతలు పీవీజీ కుమార్‌కు అప్పగించారు. దీంతో మాడుగుల నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
ఒక గ్రూపుకు గవిరెడ్డి రామానాయుడు, ఇంకో గ్రూపుకు పీవీజీ కుమార్, మరో గ్రూపుకు పైలా ప్రసాదరావు నాయకత్వం వహిస్తున్నారని అంటున్నారు. టీడీపీ అధిష్టానం ఆశించింది ఒకటైతే... ఇక్కడ జరిగింది మరొకటి పేర్కొంటున్నారు. పార్టీలో రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులయ్యాయని వివరిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. దీంతో ఏమి చెయ్యాలో అర్థం కాక టీడీపీ అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారని పేర్కొంటున్నారు.
ఇటీవల చోడవరంలో జరిగిన అనకాపల్లి జిల్లా టీడీపీ మినీ మహానాడుకు కార్యకర్తలను తరలించడంలోనూ కుమార్ వెనుకబడ్డారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఈ గ్రూపులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో వైపు ఇదే సమయంలో పైలా పౌండేషన్ చైర్మన్ పైలా ప్రసాదరావు టీడీపీకి రూ.25 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో మాడుగుల అసెంబ్లీ సీటును చంద్రబాబు వీరి ముగ్గురిలో ఎవరికి కేటాయిస్తారో అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.