మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఆయన పర్యటనలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఎలాగైనా సరే అక్కడ ‘లాస్ట్ ఛాన్స్’ పేరుతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చేసారి పొత్తులతో అయినా.. లేకున్నా అయినా కూడా అధికారం సంపదించాలని యోచిస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా చంద్రబాబు ఇదే తరహా పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా చంద్రబాబు ఇప్పటికే తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. డిసెంబర్ 21న ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు.
2023లో టిఆర్‌ఎస్ -బిజెపిలు పోటీపడి తెలంగాణ హంగ్ అసెంబ్లీ వస్తే టిడిపి కింగ్ మేకర్ పాత్ర పోషించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు తెలంగాణాలో పార్టీని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేయడంతో నేతలంతా వివిధ పార్టీల్లో చేరిపోయారు. మిగిలిపోయిన సమయం చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు పునర్నిర్మాణం పెద్ద సవాలుగా మారనుంది.
అయితే క్యాడర్ మాత్రం పదిలంగా ఉండడంతో మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుని రెండు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఈసారి పొత్తుకు అవకాశం లేదు. మరి ఆ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేక పొత్తు పెట్టుకుంటుందా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.