ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు నాయుడు బీజేపీని ఎలా తిట్టాడో అందరికీ తెలిసిందే. ఏపీలో పోలింగ్ అయిపోయాకా కూడా చంద్రబాబు నాయుడు కమలం పార్టీని ఇష్టానుసారం తిట్టారు. మోడీని అనరాని మాటలు అన్నారు. ఏపీలో పోలింగ్ వరకూ విమర్శించి ఉంటే అదో లెక్క, అయితే ఏపీలో పోలింగ్ అయ్యాకా.. పక్క రాష్ట్రాలకు వెళ్లి సైతం మోడీని చంద్రబాబు నాయుడు తిట్టారు.
అయితే ఎన్నికల ఫలితాలు రాగానే చంద్రబాబు నాయుడి తీరు మారిపోయిందనే విషయం కూడా స్పష్టం అవుతోంది. ఇప్పుడైతే మోడీతో తనకు విబేధాలు లేవంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించుకుంటూ ఉన్నారు. ఇలా బీజేపీ ప్రాపకం కోసం చంద్రబాబు నాయుడు ఆరాటపడుతూ ఉన్నారు.
ఆ సంగతలా ఉంటే.. ఇక తను ఇసుక మీద చేయబోయే దీక్షకు కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు కావాలంటూ చంద్రబాబు నాయుడు ఆరాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ మద్దతును కూడగట్టాలంటూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అర్థిస్తున్నారట. ఈ మేరకు తెలుగుదేశం బృందం వెళ్లి ఏపీ బీజేపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను కలవనుందట. ఇసుక మీద దీక్షకు సపోర్ట్ చేయాలంటూ ఆయనను వీరు కోరనున్నట్టుగా సమాచారం.
మొత్తానికి ఆరు నెలలు గడిచే సరికి భారతీయ జనతా పార్టీ ముందు చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ సాగిలా పడుతున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు.