కరోనా విపత్తును ఎదుర్కొనడానికి విధించిన లాక్ డౌన్ వల్ల జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ రంగాలతో పాటు దాదాపుగా అన్ని రంగాలు లాక్ అయిపోయాయి. ఇక, కరోనా సెగ రాజకీయ పార్టీలకూ తగిలింది. లాక్ డౌన్ వల్ల ఏపీలో చేపట్టదలిచిన పలు సంక్షేమ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, వైఎస్సార్ పెళ్లి కానుక వంటి పథకాలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో టీడీపీ నిర్వహించదలచిన మహానాడు కార్యక్రమం కూడా వాయిదా పడనుందని తెలుస్తోంది. రేపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరగబోతోన్న పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణ పై నిర్ణయం వెల్లడించనున్నారని తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలిట్ బ్యూరో సమావేశం నిర్వహించబోతున్నారు.
ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలు, మద్యం అమ్మకాలు, విశాఖలోఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన వంటి అంశాలపై పాలిట్ బ్యూరోలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ‘మహానాడు’ వాయిదాపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి మహానాడు ఈ ఏడాది జరగాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మే 27 నుంచి మూడు రోజులపాటు `మహానాడు` ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే, కరోనా నేపథ్యంలో మహానాడుని ఈసారి వాయిదా వేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక వేళ మే 17తో లాక్ డౌన్ ముగిసినప్పటికీ....బహిరంగ సభలు, సమావేశాలు, ప్రార్థనా మందిరాల్లో భక్తులను అనుమతించే అవకాశం లేదు. దీంతో, ఈ ఏడాదికి వాయిదా తప్పదని తెలుస్తోంది. గత ఏడాది కూడా మహానాడుకు బదులుగా ఎన్టీఆర్ జయంతిని గ్రామగ్రామన ఘనంగా నిర్వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మహానాడు నిర్వహణకు 3 రోజులే తేడా ఉండడంతో చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కరోనా వల్ల మహానాడు వాయిదా పడే అవకాశం ఉండడంతో....వరుసగా రెండేళ్లు మహానాడు వాయిదా పడే చాన్స్ ఉంది.