ఆయన అలుపెరగని రాజకీయ యోధుడు. విద్యార్ధి స్థాయి నుంచి రాజకీయాలను మొదలుపెట్టారు. యువకుడిగా ఉన్నపుడే ఎమ్మెల్యే, మంత్రిగా కాంగ్రెస్ జమానాలో పనిచేశారు. ఈ రోజుకు దేశంలో చూసుకుంటే వేళ్ల మీద లెక్కబెట్టగలిగే సీనియర్ మోస్ట్ నేతలల్లో చంద్రబాబు కూడా ఉంటారు. పొలిటికల్ గా ఆయనది లాంగ్ కెరీర్. ఇక చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
విపక్ష నేతగా మూడు దఫాలుగా కొనసాగుతున్నారు. అలాంటి చంద్రబాబు ఏడు పదుల వయసులో కూడా చాలా మంది యంగ్ పొలిటీషియన్ల కంటే ఎక్కువగా చురుకు చూపిస్తారు. ఆయన పోరాట పటిమ ఈనాటి తరానికి స్పూతి దాయకం అని ప్రత్యర్ధులు కూడా అంటూంటారు. చంద్రబాబు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు, ప్రధానులు రాష్ట్రపతులను ఆయన ఎంపిక చేశారు. టీడీపీని ఎన్టీయార్ స్థాపించినా కూడా చంద్రబాబే దానికి జవం, జీవం కలిగించారు అంటే అతిశయోక్తి కాదు.
అలాంటి చంద్రబాబు 2019 లో పార్టీ ఓటమి తరువాతనే ఈ రాజకీయం ఇక చాలు అని రిటైర్ అవాల్సింది. అయితే పార్టీ మళ్ళీ పవర్ లోకి వస్తే లోకేష్ కి బాధ్యతలు అప్పగించాలనుకున్నారని చెబుతారు. అయితే అది నెరవేరలేదు. దాంతో మరో అయిదేళ్ల పాటు ఆయన భారమైనా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికార వైసీపీ నుంచి వస్తున్న దాడులను ఆయన తట్టుకోలేకపోతున్నారు.
ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా వైసీపీ పోకడలు ఉండడం కూడా చంద్రబాబు మార్క్ స్ట్రాటజీకి అంతుపట్టడంలేదు అనే వారూ ఉన్నారు. దీంతో పాటు ఏపీలో గతానికి భిన్నంగా వైసీపీ ముల్లును ముల్లుతోనే కోయాలి అన్న రాజనీతిని అమలు చేయడం వల్ల కూడా టీడీపీ శ్రేణుల్లో ఒక దశలో నైతిక స్థిర్యం సన్నగిల్లింది. ఇలా పార్టీ పరంగా ఇబ్బందులు ఉంటే మరో వైపు పార్టీ కూడా అనుకున్నంతగా లేవకపోవడంతో బాబు లో ఏదో దశలో నిరాశ ఆవరించిన మాట వాస్తవమని అంటారు.
ఈ నేపధ్యంలో తాజాగా అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనలకు కలత చెంది బాబు ఏకంగా మీడియా ముందునే బోరుమన్నారు. ఆయన్ని ఈ రోజు దాకా ధీరుడిగా చూసిన టీడీపీ శ్రేణులు సైతం నిశ్చేష్టులైపోయాయి. ఇక బాబు కుటుంబీకులు అయితే తట్టుకోలేకపోయారు. ఆయన సన్నిహితులు, అభిమానులు ఈ రొచ్చు రాజకీయాల్లో ఎందుకు బాబు గారూ అంటూ ఓదార్పు మాటలు కూడా పలికారు. అయితే చంద్రబాబుకు కూడా వర్తమాన రాజకీయ పోకడల పట్ల అంత ఇష్టం లేదని, తరం మారింది అన్న స్పృహ కూడా ఆయనలో ఉందని కూడా అంటున్నారు.
చూస్తూ చూస్తూ కాడె వదిలేయడం మంచిది కాదనే బాబు భావనగా చెబుతున్నారు. ఏపీ ప్రజలు విభజన తరువాత ఎన్నడూ లేనంత ఇబ్బందులో ఉన్నారని, రాజధాని, పోలవరం లాంటి అనేక సమస్యలు అలా పెండింగులో పడ్డాయని ఆయన సన్నిహితులతో అంటున్నట్లుగా చెబుతున్నారు.
ఇక రాజకీయాలలో ఉండాలా వద్దా అన్నది తన చేతులలోనే ఉన్నా ప్రజల అవసరాలు, ఏపీ భవిష్యత్తు దృష్ట్యా వారి వద్దకే వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోవాలన్నదే బాబు తాజా ఆలోచనలు అంటున్నారు. ఏపీలో 2024 ఎన్నికలు నిజానికి టీడీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతున్నాయి. పార్టీ గెలిస్తేనే భవిష్యత్తు. మరి రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇందులోనే ఇమిడి ఉందని చెబుతూ సానుభూతి అస్త్రంతో పాటు సెంటిమెంట్ ని కూడా జోడించి జనాల వద్దకు పోవాలన్నదే బాబు మార్క్ పాలిటిక్స్ గా చెబుతున్నారు.
ఇక ఆయన సూటిగా సుత్తిలేకుండా జనాలకు చేసే అప్పీలు ఒక్కటే అంటున్నారు. నా అవసరం ఉంటే 2024లో టీడీపీని గెలిపించండి, వద్దు అనుకుంటే రిటైర్ అయిపోతాను అని అప్పీల్ చేస్తారని తెలుస్తోంది. ఒక విధంగా బాబు వంటి సీనియర్ మోస్ట్ నోటి వెంట ఈ మాటలు వస్తే అది జనాల్లో భారీ ఇంపాక్ట్ చూపించడం ఖాయమని అంటున్నారు. ఏపీ అన్ని విధాలుగా చితికిపోయిన నేపధ్యంలో టీడీపీ అవసరం లేదు అని జనాలు ఎటూ చెప్పే సీన్ ఉండదనే బాబు అంచనా కడుతున్నారు.
ఒకవేళ అప్పటికీ వైసీపీ మీద మోజు తీరక ఆ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపితే మాత్రం మొత్తం రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి హ్యాపీగా రిటైర్ అయిపోదామన్నదే బాబు ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి మరో రెండున్నరేళ్ళలో బాబు జాతకాన్నే కాదు, తమ జాతకాన్ని కూడా ఏపీ ప్రజలు ఎలా రాసుకుంటారో తెలుస్తుంది అని టీడీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.