రాధా హ‌త్య‌కు రెక్కీ.. అస‌లు దోషుల‌ను త‌ప్పిస్తారా అని బాబు ధ్వ‌జం..!

Update: 2022-01-01 17:07 GMT
ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగ‌వీటి రాధా హ‌త్య రెక్కీ అంశం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాధా తాజాగా త‌న హ‌త్య‌కు కొంద‌రు రెక్కీ నిర్వ‌హించారంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అధికార వైసీపీతో పాటు ఇటు ప్ర‌తిప‌క్ష టీడీపీలోనూ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. చివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ సైతం రాధాకు గ‌న్‌మెన్ల‌ను కేటాయిస్తున్న‌ట్టు చెప్ప‌డం.. ఆ వెంట‌నే రాధా ఆ భ‌ద్ర‌త‌ను రిజెక్ట్ చేయ‌డం జ‌రిగాయి. చివ‌ర‌కు ఈ విష‌యంలో చంద్ర‌బాబు సైతం డీజీపీకి లేఖ రాశారు. ఈ రోజు చంద్ర‌బాబు రాధా ఇంటికి వెళ్లారు. శ‌నివారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో రాధా ఇంటికి వెళ్ల‌డంతో పాటు భ‌ద్ర‌త విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

రాధాకు టీడీపీ పూర్తి అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న చేసిన బాబు.. కుట్ర రాజ‌కీయాల‌పై క‌లిసిక‌ట్టుగా పోరాడ‌దామ‌ని పిలుపు ఇచ్చారు. అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. రాధా హ‌త్య రెక్కికి సంబంధించి ఆధారాలు ఉన్నా కూడా చ‌ర్య‌లు లేవ‌ని విమ‌ర్శించారు. హ‌త్య‌కు రెక్కీ జ‌రిగిన మాట వాస్త‌వ‌మా ? కాదా ? రెక్కీ దృశ్యాలు సీసీ కెమేరాల్లో రికార్డు అయినా ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వం ఈ విష‌యంలో చేస్తోన్న కాల‌యాప‌న చూస్తుంటే దోషుల‌ను కాపాడేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌ప్పుడు ప‌నులు చేసిన వారిని శిక్షించాల‌ని.. త‌ప్పు ఎవ‌రు చేశారో కూడా తెలిసినా కూడా వారిని ప‌ట్టుకోకుండా.. చ‌ర్య‌లు తీసుకోకుండా ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని ప్ర‌భుత్వం చెపుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌ని బాబు విమ‌ర్శించారు.

ఇక రాధా త‌న హ‌త్య‌కు జ‌రిగింద‌న్న విష‌యంపై విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ క్రాంతి రాణ టాటా కూడా స్పందించారు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు ఫిర్యాదు అంద‌లేద‌ని.. అయితే తాము సీసీ ఫుటేజ్ దృశ్యాలు ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు.
Tags:    

Similar News