వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారు అన్నది ప్రచారంలో ఉన్న మాట. అయితే ఆ రెండవ నియోజకవర్గం కూడా రాయలసీమకు చెందినదే ఎంచుకుంటారని అంటున్నారు. కుప్పంలో టీడీపీ గెలుపునకు ఎలాంటి డౌటూ లేకపోయినా టీడీపీ ఒకనాటి కంచుకోట అయిన అనంతపురాన్ని కాపాడుకోవడం, మొత్తానికి మొత్తం సీట్లను గెలుచుకోవాలని చూసేందుకే బాబు ఈ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు.
ఇక చూస్తే ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో అత్యధిక సీట్లను టీడీపీ గెలుచుకుని వైసీపీకి దెబ్బేసింది. కానీ 2019 నాటికి మొత్తం రివర్స్ అయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న 14 సీట్లలో రెండు సీట్లు తప్ప మిగిలినవి అన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఉరవకొండలో పయ్యావుల కేశవ్, అలాగే, నందమూరి బాలక్రిష్ణ హిందూపురంలో మాత్రమే గెలిచారు. దాంతో వైసీపీ రాజకీయ దూకుడుకు హద్దే లేకుండా పోయింది.
మూడున్నరేళ్ళు గిర్రున తిరిగేసరికి నాయకులలో వర్గపోరు, దూకుడు, నోటి దురుసు వంటి వాటితో పాటు అభివృద్ధి లేమి, అవినీతి, వివాదాలు ఇత్యాది విషయాలు అన్నీ కలసి అధికార వైసీపీ మీద జనంలో విరక్తిని పెంచేలా చేశాయని అంటున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీకి ఇపుడు జేసీ బ్రదర్స్ వంటి పవర్ ఫుల్ లీడర్స్ ఉన్నారు. పరిటాల ఫ్యామిలీ ఉంది. ఆలాగే పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇంకా ధీటైన నేతలు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాధరెడ్డి వంటి వారు కనిపిస్తారు.
కరోనా ముందు వరకూ ఈ జిల్లాలో వైసీపీదే రాజ్యం. ఆ పార్టీ చెప్పిందే వేదం అన్నట్లుగా కధ నడిచింది. కానీ అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఈ జిల్లాకు చెందిన మంత్రులు కూడా పార్టీని ఏకత్రాటిపైన నడిపించే విషయంలో ఫెయిల్ అయ్యారు. గతంలో శంకర్ నారాయణకు మంత్రి పదవి ఇస్తే ఆయన కూడా ఏమీ చేయలేదని చెబుతారు. ఇపుడు ఉషా చరణ్ మంత్రి అయ్యారు. ఆమెకు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉంది.
దీనికి తోడు నాయకుల నోటి దురుసు కూడా పార్టీకి చేటు తెస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా టీడెపీఎ అధినాయకుడు చంద్రబాబు మీద పరిటాల ఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ కాక రేపాయి. ఆ తరువాత ఆయన క్షమాపణలు చెప్పినా జనాల్లో అయితే వ్యతిరేకత వచ్చింది. మరో వైపు చూస్తే టీడీపీ నేతలు కూడా బాగా యాక్టివ్ అయ్యారు.
ఎక్కడికక్కడ వైసీపీ నేతలను వారు నిలువరిస్తున్నారు. వైసీపీ గ్రాఫ్ కూడా మెల్లగా తగ్గడంతో ఈ అవకాశాన్ని వాడుకోవాలని టీడీపీ చూస్తోంది. దాంతో చంద్రబాబు అనంతపురం జిలాలో తాను స్వయంగా పోటీకి దిగడం ద్వారా టోటల్ గా ఉన్న 14 సీట్లను గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. దాంతో ఆయన తనకు ధీటైన నియోజకవర్గం ఎంపికలో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి అనంతపురం జిల్లాలో అనంత కష్టాలు ఏర్పడుతూంటే అనంతమైన ఆనందంతో టీడీపీ ఉంది.
మరి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ ఎంతవరకూ రిపేర్లు చేసుకుని ముందుకు వస్తుంది అన్నది చూడాలి. అయితే ఒక్కసారి గాలి మార్పు కనిపిస్తే మాత్రం దాన్ని ఆపడం ఎంతటి మొనగాడు లాంటి నాయకుడు అయినా అతని వల్ల కానే కాదని అంటున్నారు. చూడాలి మరి అనంతపురంలో బాబు పోటీ చేస్తే రాజకీయం ఎలా టర్న్ అవుతుందో.