ఏపీ సీఎం చంద్రబాబు పై సినీనటి, నగరి వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా రెడ్డి పదునైన పంచ్‌లు విసిరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రెండుసార్లు వాయిదా పడ్డాయి. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 9 నుంచి రైతు కోసం చంద్రన్న యాత్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లాల వారీగా ఈ యాత్ర ఉంటుందని ఆయన షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ యాత్రలో రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు చెప్పే బోర్డులను కూడా పెడతామన్నారు.
ప్రత్తిపాటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రోజా రెడ్డి మాట్లాడుతూ ఈ యాత్రకు రైతు కోసం చంద్రన్న యాత్ర అని కాకుండా చంద్రన్న కరువు యాత్ర అని పేరు పెడితే చాలా సూపర్‌గా ఉంటుందని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో కరువు విలయతాండవం చేస్తోందని...అయినా సర్కార్‌కు అస్సలు వారి గోడు పట్టడం లేదని రోజా రెడ్డి విమర్శించారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని రోజా ధ్వజమెత్తారు.
అలాగే అంతకు ముందు అసెంబ్లీలో కూడా ఏపీలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై వైకాపా ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించడంతో వైకాపా సభ్యులు ఫ్ల కార్డులతో నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మళ్లీ సభ ప్రారంభమైనా మళ్లీ ఇదే తంతు జరగడంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు. ఏదేమైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో రోజా రెడ్డి కాస్త ఘాటుగానే అధికార పక్షంపై తన గళాన్ని విప్పారు. నిన్నటికి నిన్న రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో శ్రీమంతుడు స్టోరీ చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావును విమర్శించిన ఆమె ఈ రోజు చంద్రబాబుపై విమర్శలు గుప్పించి..కాస్త అట్రాక్షన్ అయ్యారు.