విక్రమ్ ల్యాండర్.. ఇక కష్టమేనా..?

Update: 2019-09-14 06:21 GMT
చంద్రయాన్2.. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపై పంపిన ఈ మిషన్ చివరి నిమిషంలో సిగ్నల్స్ కట్ అయిపోయి సంబంధాలు కోల్పోయిన సంగతి తెలిసిందే..

సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో ప్రయత్నం చేసింది. అయితే చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి.

అయితే విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో పంపిన చంద్రుడిపై తిరుగుతున్న ఆర్బిటర్ గుర్తించింది. చంద్రుడిపై విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 8వ తేదీ నుంచి సిగ్నల్ కోసం ఇస్రో ప్రయత్నిస్తోంది.

అయితే చంద్రుడిపై ఒక రోజు ముగియబోతోంది.అంటే మన 14 రోజులకు చంద్రుడిపై ఒక రోజు.. ఈనెల 21వరకు చంద్రుడిపై పగలు ఉంటుంది. ఆ తర్వాత 14రోజులు చీకటి. అంటే విక్రమ్ ల్యాండర్ తో కనెక్టివిటీకి ఇంకా 7 రోజులే సమయం ఉంది.

ప్రస్తుతం విక్రమ్ తో సంబంధాల పునరుద్ధరణ కోసం శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతీ గంట, నిమిషం ఇప్పుడు ఎంతో విలువైంది. ఎందుకంటే ఇప్పటికే విక్రమ్ చంద్రుడిపై దిగి వారం గడిచింది. విక్రమ్ కు ఉన్న బ్యాటరీలో శక్తి రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. విక్రమ్ ఇస్రోతో కనెక్ట్ అయితే సూర్యరక్ష్మి ప్యానెల్స్ ఆన్ చేసి శక్తిని పుంజుకుంటుంది. ఆన్ కాకపోవడంతో తిరిగి శక్తిని నింపుకునేందుకు ఎలాంటి వెసులుబాటు లేదు. దీంతో బ్యాటరీ పనిచేసేలా చేయడానికి మరో వారం రోజులు మాత్రమే కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో మన విక్రమ్ పై ఆశలకు వారం రోజులే టైం అన్నమాట..

   

Tags:    

Similar News