చంద్రయాన్ ను వదలని మోడీ

Update: 2019-07-28 10:33 GMT
దేశం కోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను మొన్నటి ఎన్నికల ప్రస్తావించి జాతీయ భావాన్ని రెచ్చగొట్టి ఆ క్రెడిట్ ను మోడీ తన ఖాతాలో వేసుకున్నాడన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించి చంద్రయాన్2 ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దీన్ని కూడా వదలకుండా మోడీ తన ఖాతాలో వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం మన్ కీ బాత్ నిర్వహించిన ప్రధాని మోడీ చంద్రయాన్ 2 ప్రయోగం తమ హయాంలో జరగడం.. విజయం సాధించడం గర్వకారణమన్నారు. ప్రతీ భారతీయుడి హృదయం ఉప్పొగిందన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన చంద్రయాన్ 2 సక్సెస్ ఈ ఏడాది భారత అంతరిక్ష, పరిశోధన రంగాలకు సానుకూల ఫలితం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.  ఇక సెప్టెంబర్ కోసం అందరూ ఎదురు చూద్దామని.. చంద్రుడి కక్షలోకి చేరాక సంబరాలు చేసుకుందామంటూ ఇస్త్రోపై పొగడ్తల వర్షం కురిపించారు.

ఇక తన ప్రభుత్వ హయాంలో కొత్తగా ప్రవేశపెట్టిన జలశక్తి అభియాన్ పథకాన్ని సక్సెస్ చేయాలని కోరారు. జలవనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలని.. మేఘాలయ, హర్యానా నీటిని ఒడిసిపట్టేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. నీటి వనరుల సంరక్షణ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.


Tags:    

Similar News