చందమామను అత్యంత సమీపం నుంచి పరిశీలన జరిపేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి దిగ్విజయంగా నింగిలోకి ఎగసిన చంద్రయాన్... ఇప్పటికే పలు ముఖ్య దశలను దాటుకుని విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రయోగంలో కీలకమైన దశ నేటి రాత్రి 1.55 గంటలకు ముగియనుంది. చంద్రుడి ఉపరితలంపై దక్షిణ దృవంపై విక్రమ్ ల్యాండ్ కానుంది. ల్యాండర్ గా పిలుస్తున్న విక్రమ్ చంద్రయాన్ లో కీలక పరికరమన్న విషయం తెలిసిందే. ఈ పరికరం చంద్రుడి తలంపై దిగనున్న ఘట్టమే మొత్తం చంద్రయాన్ 2లో అత్యంత కీలక ఘట్టంగా ఇస్రో పేర్కొన్న సంగతి తెలిసిందే.
ల్యాండర్ విక్రమ్ తో పాటు రోవర్ ప్రగ్యాన్ జీవిత కాలం 14 రోజులే. అదే చంద్రయాన్ 2 ఆర్బిటర్ జీవిత కాలం ఏడాది అయినా... మొత్తం ప్రయోగంలో కీలకమైన విక్రమ్ జీవితకాలం మాత్రం 14 రోజులే. ఈ 14 రోజుల్లోనే విక్రమ్ పంపించే సమాచారంతోనే చంద్రుడి ఉపరితలంపై ఏమేం ఉన్నాయన్న విషయం తేటతెల్లం కానుంది. అంటే... ఈ మొత్తం ప్రయోగంలో చంద్రుడి తలంపై విక్రమ్ ల్యాండ్ కావడమన్నదే అత్యంత కీలక దశ. ఓ 15 నిమిషాల పాటు సాగే విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియపై ఇప్పుడు దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ... పాఠశాల విద్యార్థులతో కలిసి విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియను కంట్రోల్ రూంలో కూర్చుని నేరుగా పరిశీలించనున్నారు. స్వయంగా ప్రధానే ఈ కీలక ఘట్టాన్ని ప్రత్యక్ష్యంగా పరిశీలించేందుకు సిద్ధమయ్యారంటేనే... ఈ దశకు ఎంత ప్రాధాన్యం ఉందో ఇట్టే అర్థం కాక మానదు.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఇస్రో చైర్మన్ శివన్.. చంద్రయాన్ 2లో ఈ 15 నిమిషాలే అత్యంత కీలకమని చెప్పారు. చంద్రయాన్ 2 కోసం ఏళ్ల తరబడి శ్రమించినా, గత కొన్ని రోజులుగా ఈ ప్రయోగాన్ని దశలవారీగా విజయవంతం చేస్తున్నా... చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండింగ్ అయ్యేందుకు పట్టే 15 నిమిషాలే కీలకమని ఆయన వెల్లడించారు. మొత్తంగా చంద్రయాన్ 2లో అత్యంత కీలకంగా పరిగణిస్తున్న ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో తిలకించేందుకు యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని దశలను దిగ్విజయంగా ముగించుకుంటూ సాగుతున్న చంద్రయాన్ 2... తన చివరి దశలోనూ విజయం సాధిస్తుందని, సాధించాలని కూడా యావత్తు దేశం ప్రార్థిస్తోంది. మొత్తంగా చంద్రయాన్ 2లో అత్యంత కీలక దశగా పరిగణిస్తున్న విక్రమ్ ల్యాండింగ్ ప్రాసెస్ ఫీవర్ దేశం యావత్తును చుట్టేసింది.