ఒకట్రెండు రోజులు అటు ఇటూగా సరిగ్గా నెల రోజుల్లో ఒక భారీ కార్యక్రమం ఏపీలో నిర్వహించనున్నారు. ఏపీ రూపురేఖల్ని మార్చేసి.. చరిత్రలో ఏపీకి సరికొత్త స్థానంలో ఇచ్చే ఒక ఘటన చోటు చేసుకుంది. ఇంతకాలంగా రాజధాని నగరం లేదన్న కొరత తీరిపోవటంతో పాటు.. ఏపీ ప్రజల కలల పంట అయిన ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపనను అక్టోబర్ 22న నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ.. సింగపూర్ ప్రధానితో పాటు.. జపాన్ మంత్రితో పాటు భారీగా వీవీఐపీలు.. సామాన్యల చెంత శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లను ఏపీ సర్కారు చేస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా.. అతిధులుగా వచ్చే వారు తమ జీవితంలో మర్చిపోలేని అతిధ్యాన్ని ఇచ్చేలా అమరావతి శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఎంత గ్రాండ్ గా ఉంటుందంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత లోకానికి తెలిసేలా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇక.. శంకుస్థాపన కోసం ఇప్పటివరకూ అనుకున్న వాటి గురించి చూస్తే.. వావ్ అనిపించక మానదు.
= గుంటూరు జిల్లా తూళ్లురు మండలం వెంకటపాలెం (కృష్ణా నది తీరంలో) 50 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమం నిర్వహిస్తారు
= విదేశీ.. స్వదేశీ ప్రముఖులతోపాటు 50వేల మంది సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించే ఏర్పాట్లు చేయనున్నారు
= వందమంది కులాసా కూర్చొని శంకుస్థాపన కార్యక్రమం చూసేలా వేదికపై సోఫాలు అరేంజ్ చేయనున్నారు
= దాదాపు వెయ్యి మంది వీవీఐపీలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు
= ప్రాంగణంలో ఎక్కడ ఎవరున్నా స్పష్టంగా కనిపించేలా.. ప్రసంగాలు స్పష్టంగా వినిపించేలా వీడియో.. ఆడియోలను ఏర్పాటు
= వివిధ దేశాల సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ
= దాదాపు 5 వేల మంది వీవీఐపీలకు శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఆహ్వాన పత్రాన్ని పంపనున్నారు
= ఆహ్వాన పత్రాలను ప్రముఖులకు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు
= ఇక.. కార్యక్రమం జరిగే ప్రాంగణంలో ప్రత్యేకంగా బ్యాన్లు.. సైన్ బోర్డుల ఏర్పాట్లు
= లోకల్.. నేషనల్.. ఇంటర్నేషనల్ మీడియాకు ఆహ్వానం
= అక్టోబరు 1 నుంచి ప్రింట్.. రేడియో.. టీవీ.. డిజిటల్ ఇలా అన్ని మీడియాల్లోనూ శంకుస్థాపన గురించి ప్రత్యేక యాడ్స్ ఇవ్వనున్నారు
= శంకుస్థాపన తర్వాత ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ
= సామాన్యులకు భారీ ఏర్పాట్లు. 50వేల మంది కూర్చునేలా కుర్చీలు
= పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి.. మరుగుదొడ్లు.. తాగునీరు.. అంబులెన్స్ లతో పాటు.. అనుకోని ప్రమాదం జరిగితే ఎదుర్కొనేలా ఏర్పాట్లు.