తెల్ల తెల్లారక ముందే పల్లే లేచింది ..తన వారినందరినీ తట్టీ లేపింది ..అని రాశారు మల్లెమాల అనే ఓ సహజ కవి. ఎంత గొప్ప పాట.. వెలుగు దుస్తుల్లో సూరీడు అని కూడా రాశారాయన. పల్లె నుంచి వచ్చిన కవి ఆయన. నెల్లూరు రెడ్డి గారు ఇంత మంచి సాహిత్యం రాశారు..అని అబ్బురపడ్డారు అంతా ! అదీ ఆయన గొప్పతనం.
ఆ తరువాత పల్లె మారిన వైనం ఎన్నో సార్లు ఎన్నో పాటల్లో వచ్చింది. గోదావరి ఇసుక తిన్నెలు లేవు.. పొలం లేదు పని లేదు అని ఏడ్చిన కవీ ఉన్నాడు.. అలానే పల్లె మారింది అని కన్నీరు పెట్టిన విజయనగరం దారుల్లో పాటలూ ఉన్నాయి.. పల్లె మారింది అని చెప్పడం మార్పునకు సంకేతం అని భావించాలి. లేదా నగరీకరణలో ఇవాళ వస్తున్న మార్పునకు దోహదకారి ఈ మార్పు అని నిర్థారించాలి.
దేశ జనాభాలో ఒక నాటి కన్నా ఇప్పుడు పల్లె కన్నా పట్టణీకరణ పెరగడం సంబంధిత జనాభా వృద్ధికి నోచుకోవడంతో, అనూహ్య స్థాయిలో ఆ పెరుగుదల ఉండడంతో గతం కన్నా మెరుగయిన ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తేలింది. ఆ విధంగా స్వాతంత్ర్యం అనంతర పరిణామాలు లేదా పోకడలతో పోలిస్తే ఇవాళ వాటికి మించిన అనూహ్య ఫలితాలు లేదా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అంతా చెడు అని చెప్పడంలో అర్థం లేదు. ఇదంతా అనర్థాలకు సంకేతం అని రాయడం కూడా తప్పు ! ఎందుకంటే పల్లె కన్నా పట్టణాల్లో ఇవాళ విద్యావకాశాలే కాదు కూడా ఉపాధి అవకాశాలు కూడా భలే ఉన్నాయి. ఒకనాడు చీకటిలో ఉన్న కొన్ని కుటుంబాలకు అవే వెలుగులు ప్రసాదిస్తున్నాయి.
అప్పులతో నిండా కూరుకుపోయిన కొన్ని కుటుంబాలు పొట్ట చేత బట్టుకుని వచ్చి తిరిగి జీవితాన్ని ప్రారంభించి,ఆ పునః ప్రారంభ శకంలో ఆత్మ విశ్వాసం పెంచుకుని, విజయాలు నమోదు చేసిన కుటుంబాలు ఉన్నాయి.
కనుక ఆ రోజు అంటే 1950ల కాలంలో దేశ జనాభాలో పట్టణ జనాభా కేవలం 17 శాతం. ఇవాళ దేశ జనాభాలో యాభై శాతానికి పైగా అంటే ఆశ్చర్యం ! ఆ విధంగానే కొన్నింట జీవన ప్రమాణ వృద్ధి ఆ విధంగానే వికాసం కూడా ఉన్నాయి.