ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో జరుగుతున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలే హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఎందుకంటే...మరోమారు అధికారం నిలుపుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనదైన శైలి వ్యూహాలు రచిస్తుండగా... ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనని విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఫలితంగా ఇరు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా మారిపోయింది. ఏ పార్టీ గెలిచినా కూడా స్వల్ప తేడాతోనే అధికారం చేజిక్కించుకుంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థలు... ఏపీలో ఈ దఫా వైసీపీదే గెలుపు అని నిర్ధారించేశాయి. ఈ సర్వేలతో ఆత్మరక్షణలో పడిపోయిన టీడీపీ తన అనుకూల మీడియాలో భోగస్ సర్వేల పేరిట టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపే యత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే ఓ సర్వే తెలుగుదేశం పార్టీదే గెలుపు అని తేల్చిందని టీడీపీ అనుకూల మీడియా ఓ కధనాన్ని రాయగా... దానిని సదరు సర్వే సంస్థ తిప్పికొట్టింది. అసలు తాము ఏపీకి సంబంధించి ఎలాంటి సర్వే చేయలేదని, తమ పేరిట విడుదలైన సర్వేతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దీంతో సెల్ఫ్ గోల్ వేసుకున్న ఎల్లో మీడియా తాజాగా మరో సర్వేను వెలుగులోకి తెచ్చింది. కార్పొరేట్ చాణక్య పేరిట సర్వేను వెల్లడించిన ఎల్లో మీడియా... అందులోనూ టీడీపీకి ఏకంగా 101 సీట్లు వస్తాయని, అధికారం టీడీదేనని చెప్పుకొచ్చింది. ఈ సర్వేలో వైసీపీకి 71 సీట్లు వస్తాయని పేర్కొన్న సదరు మీడియా... జనసేనకు మాత్రం 3 సీట్లు దక్కుతాయని తేల్చింది. ఇక ఏపీ సీఎంగా నారా చంద్రబాబునాయుడుకే 46 శాతం మంది ఓటేశారని చెప్పిన ఆ సర్వే... జగన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న వారి సంఖ్య మాత్రం 41 అని తేల్చింది.
ఇక మొన్నటి భోగస్ సర్వే అనుభవమో, ఏమో తెలియదు గానీ... కార్పొరేట్ ఛాణక్య వివరాలను కూడా వెల్లడించే యత్నం చేసిన సదరు మీడియా సంస్థ.... హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లోనే పేరొందినదిగా పేర్కొంది. ఇటీవలే తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ సంస్థ వెల్లడించిన సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని, అంతేకాకుండా అంతకుముందు కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఫలితాలను కూడా సంస్థ కరెక్టుగానే అంచనా వేసిందని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ సర్వే వివరాలు బయటకు వచ్చిన వెంటనే వైసీపీ దీనిపై విరుచుకుపడింది. అసలు ఊరుపేరు లేని సంస్థ కార్పొరేట్ చాణక్య అని, ఇది ముమ్మాటికీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులదే అయి ఉంటుందని వైసీపీ ఆరోపించింది. ఇలాంటి సర్వేలతో జనాన్ని మాయ చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని, ఈ కుట్రలను ప్రజలు నమ్మొద్దని కూడా ఆ పార్టీ కోరింది. మొత్తంగా కేవలం ఎల్లో మీడియాలో మాత్రమే వచ్చిన ఈ సర్వే... టీడీపీ అనుకూల మీడియాను ఏ మేరకక ముంచేస్తుందో చూడాలి.