గోవధకు సంబంధించి పార్టీల నాయకుల మధ్య సాగుతున్న వాగ్వాదాలు ఏకంగా.. నాయకులు చంపేస్తాం అని బెదిరించకునే వరకు వెళుతున్నాయి. ఈ దూకుడును ప్రదర్శిస్తున్నది మాత్రమే భాజపా నాయకుడే. కర్ణాటకలో గోవధకు సంబంధించిన వివాదం తీవ్ర రూపం దాలుస్తున్నది. బీఫ్ పార్టీ ఇస్తానంటూ ఆ మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించి ఒక వివాదానికి బీజం వేస్తే.. ఆయన చెప్పినట్లుగా బీఫ్ పార్టీ ఇస్తే గనుక.. ఆయన తల నరికి ఫుట్ బాల్ ఆడుతానంటూ.. భాజపా సీనియర నేత చెన్న బసప్ప హెచ్చరించారు. షిమోగాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
చెన్న బసప్ప కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. చాలా కీలకమైన నాయకుడు కూడా. షిమోగా ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది.
గోవధ - గోమాంసం భుజించడం గురించి కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా పనికిమాలిన చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో.. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. 'నేనెప్పుడూ గోమాంసం తినలేదు. ఈ రచ్చ అంతా చూస్తోంటే... భాజపా గోల చేస్తున్న తీరు చూస్తోంటే నాకు కూడా గోమాంసం తినాలని అనిపిస్తోంది' అన్నారు. బీఫ్ పార్టీ ఇస్తానని కూడా సెలవిచ్చారు.
ఈ వ్యాఖ్యలు చెన్న బసప్పకు తీవ్ర ఆగ్రహం కలిగించినట్లున్నాయి. షిమోగాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు. సీఎంమీద ఫైర్ అయ్యారు. బీఫ్ పార్టీ ఇస్తే గనుక.. సిద్ధరామయ్య తల నరికి ఫుట్ బాల్ ఆడుతానంటూ నిప్పులు చెరిగారు. దమ్ముంటే షిమోగాకు వచ్చి ఇక్కడ బీఫ్ పార్టీ ఇవ్వాలని, అన్నంత పని చేసి చూపిస్తామని బసప్ప హెచ్చరించారు.
ఆ తరువాత.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను బసప్పను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తానికి గోవధ, గోమాంసం భుజించడం అనే వ్యవహారాల చుట్టూ నడుస్తున్న వివాదం ముందు ముందు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం కనిపిస్తూనే ఉంది.