తెలంగాణలో తమకు తిరుగులేదని భావిస్తున్న తెలంగాణ అధికారపక్షానికి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుందని భావిస్తే.. అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని.. తమకు మించిన అభ్యర్థి లేరంటూ బలమైన వాదనను వినిపిస్తున్న గులాబీ బ్యాచ్ కు తాజా పరిణామం షాకింగ్ గా మారింది.
వరంగల్ ఉప ఎన్నికలకు ప్రచారం చేసేందుకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి.. నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అభ్యర్థి తరఫు ప్రచారం చేసేందుకు శుక్రవారం శాయన్నపేటకు కడియం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనపై ఒక రైతు చెప్పు విసిరారు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించలేదంటూ సదరు రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఊహించని పరిణామంతో షాక్ తిన్న పోలీసులు.. ఒక్కసారి అలెర్ట్ అయి.. సదరు రైతును అదుపులోకి తీసుకున్నారు. రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్న గులాబీ బ్యాచ్ కి తాజా పరిణామం ఆంతర్మధనంలో పడేలా చేసిందంటున్నారు.