జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నామినేషన్లు ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థుల లూప్ హోల్స్ ను కూడా వెతికి ప్రత్యర్థులు దెబ్బతీసే ప్రయత్నాలు తెరతీస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓ కాంగ్రెస్ అభ్యర్థినికి షాక్ తగిలినట్టు సమాచారం. నాంపల్లి నియోజకవర్గంలోని విజయ్ నగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదైనట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఇనాయా ఫాతిమా ఫేక్ డాక్యుమెంట్లు తో బీసీ-ఈ సర్టిఫికెట్ పొందారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ ఎంఆర్ఓ జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనాయ ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఎంతో కీలకమైంది. పార్టీ అభ్యర్థి పోటీకి కులం అనేదే ప్రాతిపదిక. పైగా ఈసారి 50శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించారు. అయితే కొందరు ఫేక్ డాక్యుమెంట్లతో పోటీచేశారని ప్రత్యర్థులు ఫిర్యాదులు చేయడంతో అధికారులు నిజనిర్ధారణ చేస్తున్నారు.