వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి శిక్ష ఖరారు.. 162 రోజుల తర్వాత కీలక తీర్పు
ట్రైనీ డాక్టర్‌ను హత్య చేసింది సంజయ్ రాయ్‌గా నిర్ధారించిన కలకత్తాలోని సీల్దా కోర్టు.. తాజాగా అతనికి శిక్ష ఖరారు చేసింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితుడికి శిక్ష ఖరారైంది. సోమవారం కలకత్తా కోర్టు దోషిగా సంజయ్ రాయ్‌ను తేల్చడంతోపాటు శిక్ష విధించింది. 31 ఏళ్ల వైద్యురాలిని ఆసుపత్రిలోని అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది.
వైద్య రంగానికి చెందిన వారంతా రోడ్లపైకి వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినదించారు. అప్పట్లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వైద్యులు చేసిన ఆందోళనకు మద్దతు తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారంలో జోష్యం చేసుకునే విచారణ సిబిఐకి అప్పగించింది. సిబిఐ అధికారులు సుమారు 100 మందిని విచారించి అనేక సాక్షాలను కోర్టుకు అందించారు. ఈ క్రమంలోనే ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది.
ట్రైనీ డాక్టర్‌ను హత్య చేసింది సంజయ్ రాయ్‌గా నిర్ధారించిన కలకత్తాలోని సీల్దా కోర్టు.. తాజాగా అతనికి శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదు విధించడంతోపాటు రూ.50 వేల రూపాయల జరిమానాన్ని కూడా విధిస్తూ సీల్డా కోర్టు తీర్పును ఇచ్చింది. కోర్టులో వాదనాల సందర్భంగా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని సిబిఐ వాదించింది. భారత న్యాయ సంహిత సెక్షన్ 64, 66, 103(1) ప్రకారం దోషిగా తీరిన సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష సరైనదని సిబిఐ వాదించింది. అటు ఈ కేసులో తీర్పుకు ముందు సంజయ్ రాయ్ తన వాదనను చెప్పుకున్నాడు. ఎటువంటి కారణం లేకుండా తనపై అభియోగాలు మోపారని, బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వాదించాడు.
తాను రుద్రాక్ష మాల ధరిస్తానని చెప్పాడు. తాను తప్పు చేసి ఉంటే రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలని, కానీ అలా జరగలేదని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, సంజయ్ రాయ్ బుకాయించాడు. ఇరువర్గాల వాదనలు నిన్న న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో గడిచిన ఏడాది ఆగస్టు 9న వైద్య విద్యార్థులపై అత్యాచారం జరిగింది. అనంతరం సదరు వైద్య విద్యార్థిని మృతిచెందిన విషయం తెలిసింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని విచారణను సిబిఐ అప్పగించింది. అత్యంత వేగంగా విచారణ ప్రక్రియ పూర్తికావడంతో దోషికి శిక్ష కూడా ఖరారైంది.