మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ సమయంలోనే ఆయనకు దుర్వార్త ఎదురైంది. ఆయనపై 420 కేసు నమోదు అయింది.రూ.5వేల కోట్లు తనకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు తనకు ఆ మొత్తం తిరిగి ఇవ్వడం లేదంటూ విశాఖకు చెందిన ఓ వ్యక్తి నమోదు చేసిన ఫిర్యాదుతో కడప జిల్లా ప్రొద్దుటూరులో గాలిపై కేసు నమోదు అయింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా బ్రహ్మణి స్టీల్ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లపై 420 కేసు నమోదు చేశారు. ఈ కేసు గాలి జనార్దన్ రెడ్డిని మరింత ఇరకాటంలో పడేస్తుందని అంటున్నారు.
వ్యాపార అవసరాలను పేర్కొంటూ గాలి జనార్దన్ రెడ్డి తన వద్ద రూ.5 కోట్లు అప్పు తీసుకున్నాడని విశాఖపట్నంకు చెందిన శ్రీరామ స్టీల్ అండ్ రోలింగ్ ఇండస్ట్రీస్ యజమాని బతుకుబాయ్ బాలాబాయ్ పటేల్ అనే వ్యక్తి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ విషయంలో తీసుకున్న ఈ అప్పును తిరిగి చెల్లించాలంటూ గాలి జనార్దన్ రెడ్డిని పలుమార్లు అడిగినట్లు ఆయన తెలిపారు. అయితే పదేపదే అడిగినప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి తిరిగి చెల్లించలేదని అందుకే తాను పోలీసులను ఆశ్రయించానని బాలాబాయ్ పటేల్ వెల్లడించారు. పటేల్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గాలి జనార్దన్ రెడ్డిపై 420 కేసు నమోదు చేశారు.