ప్రజాసమస్యలపై గళం విప్పారా? తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించారా? అయతే.. చెక్ తప్పదు! ఇదీ.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం తన పార్టీ ఎమ్మెల్యేలకు పంపుతున్న ప్రత్యక సందేశంగా మారింది. తాజాగా తన నియోజకవర్గం గురించి, అభివృద్ధి పనుల గురించి, మూడున్నరేళ్ల పాలన గురించి.. తరచుగా విమర్శలు చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ భారీ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే..ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సమన్వయ కర్తగా (ఇంచా ర్జ్) మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డిని నియమించింది.
ఈ మేరకు వైసీపీ అధినేత ఉత్తర్వులు ఇచ్చారు. అంటే.. వచ్చే ఎన్నికల్లో రాం కుమార్ రెడ్డికే వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం టికెట్ లభించనుం ది. అయితే.. ఇప్పుడు ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో చర్చకు వస్తోంది. దీనికి కారణం.. ప్రభుత్వంపై నోరు విప్పకూడదా? అనే సందేహమే!
గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర విబజన తర్వాత.. కొన్నాళ్లకు టీడీపీలోకి వచ్చారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్సీ ఆశించారు. అది అక్కడ దక్కలేదు.ఆత్మకూరు టికెట్ ఆశించారు. అది కూడా టీడీపీలో నెరవేరలేదు. దీంతో చివరకువైసీపీలో చేరారు. ఇక్కడకూడా ఆత్మకూరు లభించకపోయినా.. వెంకటగిరి నియోజకవర్గం దక్కింది. సీఎం జగన్ హవా.. పాదయాత్రల నేపథ్యంలో ఆనం విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ క్రమంలోనే తన తండ్రి వైఎస్ లాగా.. తనను కూడా జగన్ మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఆశించారు.
కానీ, జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం సీనియర్ నేతలు.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులైన నాయకులు చాలా మంది ఉన్నారు. దీంతో ఆనంకు ప్రాధాన్యంలేకుండా పోయింది. పైగా.. జిల్లాలోని మాజీ మంత్రి అనిల్ కుమార్, ప్రస్తుత మంత్రికాకాని గోవర్ధన్‌రెడ్డి వంటివారితో రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలతోనే ఆనం వ్యవహారం వివాదంలో పడింది. తాజాగా ఆయన ప్రభుత్వంపైనా.. పథకాలపైనా..ఎన్నికలపైనా విమర్శలు చేయడంతో సైలెంట్‌గా ఆయనను తప్పించేశారనే టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.