ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగిపోయాయి. ఫోన్, కంప్యూటర్ ఉంటే ఏది సెర్చ్ చేసినా కానీ సైబర్ కేటుగాళ్లు వివిధ నిఘా వ్యవస్థల ద్వారా మన గుట్టు మట్టు తెలుసుకుంటున్నారు. తాజాగా దేశంలో ‘పెగాసస్’ ఇజ్రాయిల్ నిఘా సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖులు, జర్నలిస్టులు, జడ్జీలపై కూడా నిఘా పెట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది.
సైబర్ నేరగాళ్లు తెలివి మీరి పోతున్నారు. అమాయకపు కస్టమర్లను ఆడుకుంటున్నారు. వారి డబ్బులు కొట్టేయడానికి రోజుకో ప్లాన్ చేస్తున్నారు. సైబర్ నేరాలతో బ్యాంకులు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో వినియోగదారులను మోసం చేసేందుకు మోసగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు.మీ ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందనే మెసేజ్ లు పంపుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ మెసేజ్ లు చూసి కస్టమర్లు భయపడుతుండగా.. నంబర్ బ్లాక్ కాకుండా ఉండాలనే తమకు ఫోన్ చేయాలని చెప్పి.. కస్టమర్లతో ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేయిస్తున్నారు.
రెండు వైపులా పదునుండే సైబర్ ప్రపంచంలో మంచికి వాడడానికి బదులు చాలా మంది చెడు కోసం వినియోగిస్తే ప్రజల సొమ్ము కాజేస్తున్నారు. ప్రపంచం భద్రతకే పెను ముప్పు తీసుకొస్తున్నారు. తెలివిగా కస్టమర్ల బ్యాంక్, ఆధార్, పాన్ నంబర్లు సేకరించి ఖాతాల్లోని డబ్బు కొట్టేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ లతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి కేసులు చాలా వెలుగుచూశాయి. దీంతో పోలీసులు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఎక్కడో ఏ దేశంలోనో ఉండి ఇంటర్నెట్ ద్వారా మారుమూల మన అకౌంట్లోని డబ్బులను కూడా దోచేస్తున్న కేటుగాళ్ల సంగతులు మనం రోజు మీడియాలో, పేపర్లలో చూస్తూనే ఉంటారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇప్పుడు మనకు శాపాలుగా మారుతున్నాయి. పొరపాటు అని తెలిసి డబ్బు ఆశలో సీక్రెట్స్ చెప్పేస్తూ సైబర్ దాడికి గురై ఉన్న సొమ్మును పోగొట్టుకుంటున్నాం. ఇటువంటి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఓ పద్ధతిలో వీరి ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము చివరకు చేరేది వారి బ్యాంకు ఖాతాలకే.. కాబట్టి వాటిని గుర్తించి ఎక్కడికక్కడ ఫ్రీజ్ చేసి దోపిడీకి అడ్డుకట్ట వేసేస్తున్నారు.
తాజాగా సైబర్ క్రైం అధికారులు దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. విజయవంతంగా అమల్లోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఎక్కువగా గుర్తించనివి ఈ అకౌంట్లు అన్నీ దాదాపుగా వేరే రాష్ట్రాల్లోనే ఉండి మెయింటేన్ చేస్తున్నారు. వారు బినామీలవి బ్యాంకు ఖాతాల సాయంతో కమీషన్ పద్ధతిలో దోపిడీకి వాడుకుంటారు.
డబ్బు ఆశతో బినామీలు చాలా మంది పది, పదిహేను బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో అన్ని ఖాతాలకు ఆధార్ లింక్ అవుతుంది. ఇప్పుడు అదే ఆధార్ లింక్ పోలీసులకు ప్రధాన అస్త్రంగా మారింది. నేరగాడు ఎప్పుడైతే డబ్బు కొల్లగొట్టి ఏ బ్యాంకు ఖాతా ద్వారా ఉపయోగించాడో ఆ ఖాతాపైనే దర్యాప్తు మొదలుపెడుతున్నారు. ఆ అకౌంట్లు అన్నింటిని పోలీసులు ఫ్రీజ్ చేస్తున్నారు.
దీంతో నేరం చేసే వారికి బినామీ అకౌంట్లు లేకుండా పోతున్నాయి. సైబర్ నేరాలకు ఇలా అడ్డుకట్ట వేస్తున్నారు. నేరానికి పాల్పడేవారిని పట్టుకోవడం.. బాధితులను ఆర్థికంగా నష్టపోకుండా పటిష్ట చర్యలు చేపట్టడమే ముఖ్యం ఉద్దేశంగా పోలీసులు వేస్తున్న ఈ అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయనే చెప్పాలి.