చెడ్డీ గ్యాంగ్ అనే పేరు ఇప్పుడు పరిచయం చేయనక్కర్లేదు. పలు రాష్ట్రాల్లో దొంగతనాలతో ఈ పేరు పాపులర్ అయిపోయింది. కేవలం చెడ్డీ మాత్రమే ధరించి దొంగతనం చేయడం వల్ల ఇలా పిలుస్తున్నారు. అయితే, తాజాగా చెడ్డీ దొంగతనాల బ్యాచ్‌లో కొత్త రకం ముదురు ఒకడు తెరమీదకు వచ్చాడు. వీడూ చెడ్డీగ్యాంగే. అంటే చెడ్డీ వేసుకొని దొంగతనం చేయడం కాదు...ఆడవారి ఇన్నర్లు మాత్రమే దొంగతనం చేసే స్పెషలిస్ట్ దొంగ.
చెన్నైలో ఈ చెడ్డీ దొంగ సంచలన చోరీలు చేస్తున్నాడు. మహిళల ఇన్నర్ వేర్స్ ఎత్తుకెళ్లే ఈ మహిళల ఇన్నర్ వేర్స్ తప్ప.. ఏ ఇంట్లోనూ మిగతా వస్తువులేవీ ముట్టుకోకుండా...దొంగతనాలు చేస్తున్నాడు. చెన్నై సిటీలోని అడంబాకం ఏరియాకు చెందిన కొందరు మహిళలు ఇలా తమ ఇంట్లో ప్రత్యేక దొంగతనాలు జరగడంతో షాక్ తిని...పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ఇన్నర్ వేర్ తప్ప మిగతా వస్తువులేవీ ముట్టుకోకుండా తమ ఇంట్లో చోరీలు జరుగుతున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. దీంతో, సీసీటీవీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. వారి ఫిర్యాదు నిజమనే తేలింది.
తెలివైన ఈ దొంగ ముఖం కనపడకుండా ముసుగు ధరిస్తున్నాడు. ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా తరచూ ఏరియాల్ని మార్చేస్తూ... ప్రహారీ గోడ దూకి కాంపౌండ్ లోకి ప్రవేశించిడం..ఆరేసిన లో దుస్తుల్ని మాత్రమే దొంగతనం చేస్తున్నాడు. వేలి ముద్రలు పడకుండా చేతులకు గ్లవ్స్ ధరిస్తూ జాగ్రత్తలు పడుతున్నాడు. దీంతో, ఈ కేసును ట్రేస్ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. సీసీటీవీలో రికార్డైన ముసుగు ముఖం ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించి - వాడికోసం గాలిస్తున్నారు.