ఏ రాష్ట్ర ప్రభుత్వ పాలనకైనా గుండెకాయ వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిగిలిన పదవుల సంగతి ఎలా ఉన్నా.. చీఫ్ సెక్రటరీ ఎంపిక విషయంలో ఆయా ముఖ్యమంత్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఎంతో నమ్మితే తప్పించి.. అవకాశం ఇవ్వరు. అంతలా లెక్కలు వేసి తీసుకొచ్చి.. ఏపీ చీఫ్ సెక్రటరీ పోస్టు లో కూర్చబెట్టిన నీలం సహానీ తాజాగా లాంగ్ లీవ్ మీద వెళ్లటానికి రెఢీ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. చీఫ్ సెక్రటరీ కావటానికి ముందు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమెను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకం గా ఎంపిక చేసుకొని మరీ రాష్ట్రానికి తీసుకొచ్చారు.
1984 బ్యాచ్ కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. గత ఏడాది నవంబరులో బాధ్యతలు చేపట్టారు. లెక్క ప్రకారం చూస్తే.. ఈ ఏడాది జూన్ వరకూ ఆమె తన బాధ్యతల్ని నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి ఆమె ఇప్పుడు ఉన్నట్లుండి.. దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏపీలో నెలకొన్న రాజకీయమే ఆమె తాజా నిర్ణయానికి కారణమన్న వాదనను వినిపిస్తున్నారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం క్లియర్ గా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మొన్న అర్థరాత్రి వేళలో.. కర్నూలు కు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించాలన్న ఆదేశాల్ని ఇవ్వటం కూడా ఆమె దీర్ఘ కాలిక సెలవుకు లింకు ఉందన్న మాట వినిపిస్తోంది. అమరావతి లో శాసన రాజధాని.. విశాఖ లో పరిపాలనా రాజధాని.. కర్నూలులో రాష్ట్ర హై కోర్టు ఏర్పాటు చేయాలన్నది జగన్ ప్రభుత్వ ఆలోచన. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మరోవైపు ఏపీ హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు వేరుగా ఉన్నాయి. అమరావతిలోని కార్యాలయాల్ని విశాఖకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు.. తీవ్రంగా స్పందించటమే కాదు.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ తరలించొద్దని హుకుం జారీ చేశాయి. తమ మాటను వినకుండా వ్యవహరిస్తే.. అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామన్న హెచ్చరిక ను ఏపీ హైకోర్టు చేసింది.
ఇలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఒకలా ఉంటే.. మరో వైపు కోర్టు నుంచి వస్తున్న ఆదేశాలు మరోలా ఉంటున్న నేపథ్యంలో.. ఈ తలనొప్పుల్ని అధిగమించేందుకు లాంగ్ లీవ్ తప్ప మరో మార్గం లేదన్న ఆలోచనకు వచ్చిన నీలం సహాని.. తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. నీలం సహాని లాంగ్ లీవ్ మీద అనధికారికం గా సమాచారం బయట కు రావటమే తప్పించి.. అధికారికం గా వచ్చింది లేదు. దీంతో.. సీఎస్ లాంగ్ లీవ్ మీద జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ఏం చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.