ట్రాన్స్ జెండర్ల ప‌ట్ల ప్రేమ‌ను చాటుకున్న ఒబామా

Update: 2017-01-18 10:47 GMT
త్వ‌లో ప‌ద‌వి దిగిపోనున్న అమెరికా అధ్య‌క్షుడు బరాక్ ఒబామా కీల‌క నిర్ణ‌యం ఒక‌టి తీసుకున్నారు. అమెరికా సైనిక ర‌హ‌స్యాల‌ను వికీలీక్స్‌ కు వెల్ల‌డించిన ట్రాన్స్‌జెండ‌ర్ సైనికురాలు చెల్సీ మ్యానింగ్‌ కు శిక్ష‌ను త‌గ్గిస్తూ బ‌రాక్ ఒబామా నిర్ణ‌యం తీసుకున్నారు. 2010 సంవ‌త్స‌రంలో వికీలీక్స్‌కు మ్యానింగ్ ర‌హ‌స్య డాక్యుమెంట్ల‌ను రిలీజ్ చేసింది. ఆ కేసులో ఆమెకు 35 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. వాస్త‌వానికి 2045 వ‌ర‌కు ఆమె జైలు జీవితాన్ని గ‌డ‌పాల్సి ఉంది. కానీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఈ కేసులో త‌న ఔదార్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. 29 ఏళ్ల మ్యానింగ్‌ కు ప‌డిన జైలు శిక్ష‌ను త‌గ్గిస్తూ ఒబామా నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో మే 17వ తేదీన ఆమెను రిలీజ్ చేయ‌నున్నారు. ఏడేళ్లుగా జైలులో ఉంటున్న మ్యానింగ్ రెండు సార్లు ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డింది. గత ఏడాది ఆమ‌ర‌ణ దీక్ష‌ కూడా చేప‌ట్టింది.

మ‌రో రెండు రోజుల్లో దేశాధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న ఒబామా చాలా మందికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించారు. సుమారు 209 మంది ఖైదీల‌కు జైలు శిక్ష త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రో 64 మందికి కూడా క్ష‌మాభిక్ష క‌ల్పించారు. అయితే వికీలీక్స్‌ కు ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టిన జాతీయ భ‌ద్ర‌తా ఏజెన్సీ(ఎన్ ఎస్ ఏ) మాజీ ఉద్యోగి ఎడ్వ‌ర్డ్ స్నోడెన్‌ కు మాత్రం ఒబామా క్ష‌మాభిక్ష ప్ర‌సాదించ‌లేదు. అమెరికా నిర్వ‌హించిన సామూహిక నిఘా వ్యవహారాలపై స్నోడెన్ త‌న ద‌గ్గ‌ర ఉన్న ర‌హ‌స్యాల‌ను వికీలీక్స్‌కు బ‌య‌ట‌పెట్టాడు. స్నోడెన్‌ కు మాత్రం శిక్ష‌ను త‌గ్గించే ప్ర‌స‌క్తి లేద‌ని ఒబామా స‌ర్కారు ప్ర‌భుత్వం పేర్కొంది. త‌ద్వారా రాజ్య ర‌హ‌స్యాల విష‌యంలో ఎంత క‌ఠినంగా ఉంటానో ఒబామా చాటిచెప్పిన‌ట్ల‌యింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News