భారతదేశంపై మరోమారు ఉగ్రవాదుల కన్నుపడింది. అయితే ఈ దఫా కొత్త ముప్పు తలపెట్టేందుకు వారు సిద్ధమయ్యారు. దేశ యుద్ధ విమానాలతో పాటు పౌరసేవల విమానాలపై ఉగ్రవాదులు రసాయన దాడులు చేసే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విషపూరితమైన రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించింది.
ఈ ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియాలోని ఓ వాణిజ్య విమానంపై రసాయన దాడి చేసే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ఇండియాలో కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఆస్ట్రేలియా అధికారుల ద్వారా సమాచారం అందినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీన అన్ని రాష్ర్టాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. హార్డ్ వేర్ షాపుల్లో దొరికే కెమికల్స్ తో దాడికి పాల్పడే అవకాశం ఉందని ప్రకటించింది. జనావాసాలు ఎక్కువగా ఉన్న చోట్ల తనిఖీలు ముమ్మరం చేయాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. దేశంలోని ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు బస్టాండ్స్‌లో భద్రత పెంచాలని ఆయా రాష్ర్టాలను, నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించింది.