ప్రపంచ చెస్ రారాజుగా వెలుగొందే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. టీనేజ్ సంచలనం.. చెన్నైకి చెందిన పోరగాడు కమ్ టీనేజ్ గ్రాండ్ మాస్టర్ అయిన ప్రజ్ఞానంద సరికొత్త చరిత్రను క్రియేట్ చేశారు.
ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో జరిగిన పోటీలో అతగాడు అద్భుత ప్రతిభను కనబర్చారు. ఎనిమిదో రౌండ్ లో కార్లసన్ మూడు వరుస విజయాలకు బ్రేక్ వేయటం ద్వారా కొత్త చరిత్రను తెర తీశారు పదహారేళ్ల ప్రజ్ఞానంద.
నార్వేకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ కార్లసన్ ను నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద ఆట కట్టించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆట మొదలైన తర్వాత కేవలం 39 ఎత్తుల్లోనే గేమ్ ను సొంతం చేసుకోవటం ద్వారా.. విశ్వనాథ్ ఆనంద్.. హరిక్రిష్ణ తర్వాత కార్ల్ సన్ పై గెలిచిన మూడో భారత ఆటగాడిగా ఆయన అవతరించారు.
అంతకు ముందు జరిగిన ఏడురౌండ్లలో అమెరికా గ్రాండ్ మాస్టర్ అరోనియన్ పై మాత్రమే గెలిచిన ఈ టీనేజ్ సంచలనం రెండు గేమ్ లను డ్రా చేసుకొని.. నాలుగింటిలో ఓడారు. ఈ టోర్నీలో గెలుపునకు మూడు పాయింట్లు.. డ్రాకు ఒక పాయింట్ కేటాయిస్తారు. ఈ టోర్నీలో రష్యా గ్రాండ్ మాస్టర్ నెపోమినియాచి అగ్రస్థానంలో ఉంటే.. లిరెన్ డింగ్ రెండో స్థానంలో ఉన్నారు.
ప్రపంచ చెస్ రారాజుపై విజయం సాధించిన ప్రజ్ఞానంద పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ క్రీడాకారులైన విశ్వనాథ్ ఆనంద్.. సచిన్ టెండూల్కర్ తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లు అభినందించారు.
ఈ సందర్భంగా విశ్వనాథ్ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పదహారేళ్లకే చెస్ రారాజు కార్లసన్ ను ఓడించాడు. అది కూడా నల్లపావులతో ఆడుతూ. నిజంగా ఇది అద్భుతం. నీ కెరీర్ సుదీర్ఘ కాలం విజయవంతంగా సాగాలి. నువ్వు దేశాన్ని గర్వపడేలా చేశావు’ అని ప్రశంసించారు. తాజా గెలుపు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు ప్రజ్ఞానంద పేర్కొన్నారు.