వైద్య అద్భుతాల్లో మరొకటి మనోళ్లు సాధించారు. చెన్నైకి చెందిన వైద్యులు ఆసియాలోనే తొలిసారి అత్యంత క్లిష్టమైన..కష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. బ్రెయిన్ డెడ్ అయిన 34 ఏళ్ల వ్యక్తి గుండె.. కాలేయం.. ఇతర శరీర అవయువాల్ని దానం చేసేందుకు అతడి భార్య అంగీకరించింది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బ తిన్న ముంబయికి చెందిన ఒక యువతికి విజయవంతంగా అమర్చారు.
దేశంలో ఇలాంటి కేసు ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కోవిడ్ పేషెంట్ కు ఊపిరితిత్తుల్ని అమర్చటం ఆసియా ఖండంలోనే ఇది తొలిసారిగా చెబుతున్నారు. ఈ ఘనత సాధించిన ఆసుపత్రిగా చెన్నైలోని గ్లెన్ గల్స్ గ్లోబల్ ఆసుపత్రిగా చెప్పాలి. రేర్ ఆపరేషన్ చేసిన ఆసుపత్రి వర్గాల్ని పలువురు అభినందిస్తున్నారు. మరి.. ఆపరేషన్ చేయించుకున్న సదరు మహిళ ఆరోగ్యం స్థిరంగా ఉందని చెబుతున్నారు.
ఇంతకీ మరణించి వ్యక్తి ఎవరు? ఎలా మరణించారన్న విషయానికి వస్తే.. సదరు వ్యక్తి అనారోగ్యం కారణంగా బ్రెయిన్ డెడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఆయనకు చెందిన పలు అవయువాల్ని దానం చేయటానికి అతడి సతీమణి ఒప్పుకోవటంతో పలువురికి మేలు జరిగింది. 2014లో జరిగిన రైలు ప్రమాదంలో చేతులు కోల్పోయిన మహిళకు అతడి చేతుల్ని అమర్చారు. కిడ్నీ.. గుండెతోపాటు శరీరంలోని పలు భాగాల్ని దానం చేశారు. దీని వల్ల పలువురికి మేలు జరిగిందని చెప్పక తప్పదు.